ఎస్సీ వర్గీకరణపై కేంద్ర కమిటీ ఏర్పాటు..!!

ఎస్సీ వర్గీకరణపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు ఎస్సీ వర్గీకరణపై కమిటీని ఏర్పాటు చేసింది.

 Formation Of Central Committee On Sc Classification..!!-TeluguStop.com

కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.ఇందులో కేంద్ర హోంశాఖతో పాటు న్యాయ, గిరిజన, సామాజిక న్యాయ శాఖల కార్యదర్శులను సభ్యులుగా నియమించింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎస్సీ వర్గీకరణకు కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.దీనిపై గతంలో సుప్రీంకోర్టు సైతం అంగీకారం తెలిపింది.

కాగా ఈ కమిటీ ఈనెల 22న తొలిసారి భేటీ కానుందని సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube