బరువు పెరగటానికి ఉపయోగపడే ఆహారం ఇది

బరువు తగ్గేందుకు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలో, ఎలాంటి ఆహారం తినాలో, ఎలాంటి వ్యాయామాలు చేయాలో ఇప్పటికీ చాలాసార్లు తెలుసుకున్నాం.కాని అందరికి బరువు తగ్గాలనే ఉండదు కదా.

 Foods That Help To Gain Weight, Walnuts, Peanuts,dark Chocolates, Weight Gain Ti-TeluguStop.com

కొందరికి బరువు పెరగాల్సిన అవసరం కూడా ఉండొచ్చు.అలాంటివారు ఏం తినాలంటే …

* పొద్దున్నే గుడ్లతో డైట్ ని ప్రారంభిస్తే మంచిది.

గుడ్లలో ఆరోగ్యకరమైన ఫ్యాట్, ప్రోటీన్లు మరియు కాలరీలు లభిస్తాయి.గుడ్లు తినడం ఆరోగ్యానికి అన్నివిధాలా మంచిది.

* పాస్తాలో కాలరీలు విపరీతంగా దొరుకుతాయి.సులువుగా బరువు పెరగాలంటే పాస్త తినటం మర్చిపోవద్దు.

రుచికి రుచి, బరువుకి బరువు దొరుకుతాయి.

* వాల్ నట్స్ లో ఫైబర్, ప్రొటీన్ తో పాటు ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ దొరుకుతాయి.

అంతే కాదు, అనారోగ్యకరమైన కొలెస్టరాల్ ని ఒంట్లోంచి తీసివేసేందుకు కూడా వాల్ నట్స్ పనికొస్తాయి.

* పీనట్స్ తో కూడా ఈజీగా బరువు పెరగొచ్చు.

ఇందులో పొటాషియం, ప్రొటీన్, హెల్తి ఫ్యాట్స్ బాగా లభిస్తాయి.మీ డైట్ లో పీనట్స్ ఉంటే తక్కువ సమయంలో బరువు పెరిగిపోతారు.

* చీజ్ లో కూడా కాలరీలు దండీగా దొరుకుతాయి.కొంచెం తిన్నా మంచి మోతాదులో కాలరీలు శరీరంలోకి చేరిపోతాయి.

పైగా ఇందులో విటమిన్ బి12, కాల్షియం అదనంగా లభిస్తాయి.

* యోగ్ రట్ కూడా బరువు పెరగడానికి ఉపయోగపడుతుంది.

ఇందులో న్యూట్రింట్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి.

* డార్క్ చాకోలేట్స్ లో కూడా వందలకొద్దీ కాలరీలు దొరుకుతాయి.

డార్క్ చాకొలెట్లు బరువు పెరగడానికే కాకుండా ఇంకెన్నో రకాలుగా పనికివస్తాయి.కాబట్టి వీటి మీద కూడా ఓ గాటు వేస్తూ ఉండండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube