రాష్ట్రంలోనే మొట్టమొదటి వరిధాన్యం సేకరణ కేంద్రం నల్గొండలో: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్లగొండ జిల్లా:రైతులకు దసరా కానుకగా రాష్ట్రంలోనే మొట్టమొదటి వరిధాన్యం సేకరణ కేంద్రం నల్గొండలో ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని,రేపటి నుంచి ధాన్యం సేకరణ వేగంగా చేపట్టాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

బుధవారం జిల్లా కేంద్రంలోని అర్జలబావి ప్రాంతంలో వరి ధాన్యం సేకరణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ అవసరం అయితే రేపే సగం ధాన్యం కొనుగోలు చేయాలని సెంటర్ నిర్వాహకులను ఆదేశించారు.రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి మూడు రోజుల్లోగా డబ్బులు చెల్లిస్తామని,జిల్లాలో 53 శాతం సన్నరకాలు,47శాతం దొడ్డు రకం ధాన్యం పండుతుందని, అన్నింటికి ఎంఎస్పీ చెల్లించి కొనుగోలు చేస్తున్నామని, అంతేకాదు సన్నాలకు 500 రూపాయల బోనస్ కూడా చెల్లిస్తామని స్పష్టం చేశారు.రేషన్ బియ్యం సద్వినియోగం అయ్యేలా రైతులను ప్రోత్సాహించడం కోసం సన్నధాన్యానికి రూ.500 బోనస్ వెంటనే చెల్లిస్తున్నామని,కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వమని,గత ప్రభుత్వం చేసిన 7 లక్షల కోట్ల అప్పుకు నెలనెల వేల కోట్ల రూపాయల వడ్డీలు చెల్లిస్తున్నామన్నారు.గత ప్రభుత్వం ఉన్నతాధికారులకు కూడా సరైన సమయంలో జీతాలు ఇవ్వలేదని,కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 వ,తేదీనే జీతాలు ఇవ్వడంతో ఉద్యోగులు సంతోషంగా ఉన్నారన్నారు.

First Grain Collection Center In The State At Nalgonda Minister Komatireddy Venk

దేశంలో ఎక్కడా లేని విధంగా ఏక కాలంలో 2 లక్షల రుణమాఫీ చేశామని, ఎక్కడైనా సాంకేతిక సమస్యలతో మిగిలిపోయిన వారికి త్వరలోనే రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.ఎస్ఎల్బీసీ టన్నెల్ బేరింగ్ వచ్చే నెల 1 వ తేదీన వస్తుందని,డిసెంబర్ వరకు కాలువలు పూర్తి చేస్తామని, ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తా,నల్గొండ రైతులకు సాగునీళ్లు అందిస్తా, ఎస్సెల్బీసీ టన్నెల్ పూర్తయితే పదవిలో ఉన్నా లేకున్నా నన్ను ప్రజలు మర్చిపోరని,ఎంత కరువు వచ్చినా ఎస్ఎల్బీసీ నుండి జిల్లాకు నీళ్లు వస్తాయన్నారు.90 శాతం పూర్తయిన బ్రాహ్మణ వెళ్లంల ప్రాజెక్టును పూర్తి చేయలేదని, టన్నెల్ పనులకు నిధులు ఇవ్వకుండా నల్గొండ రైతుల ఉసురుపోసుకున్నడని,నాపై కోపంతో నల్గొండను నిర్లక్షం చేసిండని,అందుకే నా ఉసురు,ప్రజల ఉసురు తగిలి దుర్మార్గపు పాలన అంతమైందని అన్నారు.

పన్ను కట్టలేక ఏకంగా జైలుకి వెళ్లిన పవన్ కళ్యాణ్ పెదనాన్న..!
Advertisement

Latest Nalgonda News