ఇప్పటికే కరోనా కొరల్లో చిక్కుకుని అల్లాడిపోతున్న మహారాష్ట్రను ఇతర ప్రమాదాలు కూడా అల్లకల్లోలంగా మారుస్తున్నాయి.ఈ రాష్ట్రంలో వరుసగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటూ ప్రజల పాలిట యమ దూతలా మారుతున్నాయి.
ఇక గత రెండు రోజుల క్రితం ఒక ఆసుపత్రిలో ఆక్సిజన్ లీకై సుమారు పాతికమంది వరకు ప్రాణాలు కోల్పోయిన దారుణ ఘటనను మరవకు ముందే, మరో ప్రమాదం విరుచుకు పడింది.ఆ వివరాలు చూస్తే.
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా వాసాయిలో ఉన్న విజయ్ వల్లభ్ ఆస్పత్రిలో శుక్రవారం తెల్లవారు జామున సుమారుగా 3.15 గంటలకు ఐసీయూలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న 17 మంది కరోనా పేషెంట్లలో 12 మంది మరణించినట్లు సమాచారం.కాగా మిగిలిన ఐదుగురితో పాటు ఇతర రోగులను పక్కనున్న హాస్పిటల్ లోకి షిఫ్ట్ చేసి చికిత్స అందిస్తున్నారట.ఇకపోతే ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియవలసి ఉంది.