అక్షిత ట్రేడర్స్ లో అగ్నిప్రమాదం

సూర్యాపేట జిల్లా: జిల్లా కేంద్రంలోని బీబీగూడెం దగ్గర గల అక్షిత ట్రేడర్స్( Akshita Traders ) గోడౌన్లో ఆదివారం ఉదయం షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.

స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిపమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.ఈ ప్రమాదంలో సుమారుగా కోటి రూపాయల విలువ గల కూల్ డ్రింక్ కాటన్స్ సగానికి పైగా కాలిపోగా,అందులో సామగ్రి కూడా కాలిపోయాయి.

Latest Suryapet News