దేవుడు అన్నిచోట్లా ఉండలేక అమ్మను సృష్టించాడని చాలామంది అంటుంటారు.ఎందుకంటే తల్లి తన పిల్లల విషయంలో చాలా నిస్వార్ధంగా ఉంటుంది.
వారి కోసం ప్రాణాలను ఇవ్వడానికైనా సిద్ధమవుతుంది.పిల్లలకు మంచి జీవితం అందించడానికి పొద్దున లేచిన సమయం నుంచి రాత్రి పడుకునే వరకు పనిచేస్తూనే ఉంటుంది.
అందుకే తల్లిని మించిన దైవం మరొకటి ఉండదని కూడా అంటుంటారు.
అనునిత్యం పిల్లల తిన్నారా, మంచిగున్నారా, పడుకున్నారా అనేవే తల్లికి ముఖ్యం.
అలా ఆలోచించే తల్లి తమ బిడ్డ చదువుల కోసమో లేదా ఉద్యోగం కోసమో విదేశాలకు వెళ్ళినప్పుడు ఎంతగా అల్లాడిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అయితే అలాంటి బాధలో ఉన్న తల్లిని సడన్‌గా సర్‌ప్రైజ్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలనుకున్నాడు కొడుకు.
పక్క ప్లాన్ ప్రకారం తల్లి( mother ) గుర్తుపట్టకుండా అతను తన ముఖానికి ముసుగు కట్టుకున్నాడు.ఆ తల్లి చేపలు అమ్ముతుండగా ఆమె వద్దకు వెళ్లి బేరం ఆడాడు.
అయితే రెండు నిమిషాల్లోనే ఆ అమ్మ బేరం ఆడేది తన కుమారుడేనని గుర్తించింది.ఆ తర్వాత బాగా ఎమోషనల్ అయ్యి ఆనంద భాష్పాలు కార్చింది.
తాజాగా వైరల్ అవుతున్న ఒక హార్ట్ టచింగ్ వీడియోలో ఈ మధురమైన దృశ్యాలు క్యాప్చర్ అయ్యాయి.
కర్ణాటకలోని( Karnataka ) ఉడిపిలో ఈ ఘటన చోటు చేసుకుంది.గంగోల్లి నివాసి అయిన రోహిత్( Rohit ) 3 ఏళ్ల కిందట ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్లాడు.రీసెంట్ గానే ఇంటికి తిరిగి వచ్చాడు.
అయితే ఇంటికి వస్తున్నట్లు తల్లికి గానీ, బంధుమిత్రులకు గానీ చెప్పలేదు.నేరుగా ఇంటికి వెళ్లిపోయాడు ఆ సమయంలో ఆమె ఇంట్లో లేదు.
దాంతో అతడు కందపుర తాలూకాలోని గంగోల్లి మార్కెట్‌కు వెళ్లాడు.తన అమ్మ ఉండటం గమనించి ముఖానికి కర్చీఫ్ కట్టుకున్నాడు.
కళ్ళు కనిపించకుండా గ్లాసెస్ పెట్టుకున్నాడు.ఆపై తల్లితో చేపలు బేరం ఆడటం మొదలుపెట్టాడు.
తల్లి మొదటగా అతడిని గుర్తించక చేపలను ప్యాక్ చేసి ఇచ్చింది.తర్వాత అతడు తన కొడుకే అని గుర్తించి కర్చీఫ్ లాగేసింది.
అనంతరం తన బిడ్డ మూడేళ్ల తర్వాత వచ్చాడని తెలుసుకొని చాలా ఎమోషనల్ అయ్యింది.అతడిని కౌగిలించుకొని ఆనంద భాష్పాలు కార్చింది.