మళ్లీ అవకాశం వస్తే ప్రభాస్ తో తప్పకుండా నటిస్తాను: కంగనా

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి కంగనా( Kangana ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తరచూ పలు వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా కూడా వార్తలలో నిలుస్తూ ఉంటారు.

 Kangana Interesting Comments About Prabhas, Kangana,prabhas, Ek Niranjan, Ch-TeluguStop.com

ఇక తాజాగా కంగనా రౌనత్ చంద్రముఖి 2 ( Chandramukhi 2 )సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.ఇక ఈ సినిమాలో కంగానా చంద్రముఖిగా కనిపించబోతుందని తెలుస్తోంది.

Telugu Bollywood, Chandramukhi, Ek Niranjan, Kangana, Prabhas, Tollywood-Movie

తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు కంగనాన్ని ప్రశ్నిస్తూ మీకు మరోసారి ప్రభాస్ తో కలిసి నటించే అవకాశం వస్తే నటిస్తారా అంటూ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు ఆమె తప్పకుండా నటిస్తాను అంటూ సమాధానం చెప్పారు.కంగనా రౌనత్ ప్రభాస్ హీరో హీరోయిన్లుగా ఏక్ నిరంజన్ ( Ekniranjan ) సినిమాలో నటించిన సంగతి మనకు తెలిసిందే.

ఈ సినిమా తర్వాత కంగనా బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లిపోయారు.ఈ క్రమంలోనే ఏక్ నిరంజన్ 2 అవకాశం వస్తే తప్పకుండా ప్రభాస్ తో కలిసి నటిస్తానని చెప్పడమే కాకుండా ప్రభాస్ గురించి మాట్లాడుతూ ప్రశంసల వర్షం కురిపించారు.

Telugu Bollywood, Chandramukhi, Ek Niranjan, Kangana, Prabhas, Tollywood-Movie

ప్రభాస్ సరసన నటించడానికి తాను ఇష్టపడతానని ఆయన సక్సెస్ చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుందని ఈమె తెలిపారు. ఏక్ నిరంజన్ సినిమా( Ek Niranjan ) సమయంలో ప్రభాస్ తన ఫామ్ హౌస్ నుంచి ఎన్నో రకాల ఆహార పదార్థాలను మాకు తీసుకువచ్చే వారు అంటూ ఈ సందర్భంగా ప్రభాస్ ఆతిథ్యం గురించి కంగనా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఈ సినిమా షూటింగ్ సమయంలో మేము ఎంతో సరదాగా ఉండే వాళ్ళమని అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు.అయితే ప్రభాస్( Prabhas )తో అవకాశం వస్తే నటించడానికి కంగనా సిద్దంగా ఉన్నారని ఈ సందర్భంగా చెప్పడమే కాకుండా ప్రభాస్ కి అంతా మంచే జరగాలని కోరుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube