Farmers Problems TDP : టీడీపీ రైతు పోరు బాటతో మరోసారి తెరమీదకు రైతుల సమస్యలు

దేశ, విదేశాలకు ఆక్వా ఉత్పత్తులను ఎగుమతులు చేసి, దేశానికి, రాష్ట్రానికి విదేశీమారకద్రవ్యాన్ని భారీగా తెచ్చిపెడుతున్న ఆక్వా రంగం ఆంధ్రప్రదేశ్ లో కుదేలవుతోందంటూ తెలుగుదేశం పార్టీ ఆక్వా రైతు పోరుబాట కు శ్రీకారం చుట్టింది.బహిరంగ సభతో పాటు ఉద్రిక్త పరిస్థితుల మధ్య సబ్ స్టేషన్ ముట్టడికి దిగారు తెలుగుదేశం పార్టీ నేతలు.

 Farmers Problems Have Once Again Come To The Fore With Tdp Struggle , Tdp , Tdp-TeluguStop.com

పశ్చిమగోదావరి జిల్లా ఉండి లో నిర్వహించిన ఆక్వా రైతు పోరుబాట బహిరంగ సభలో ఉభయ గోదావరి జిల్లాలలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల నుండి టీడీపీ ఇన్ ఛార్జ్ లు, నేతలు తరలివచ్చారు.ఆక్వా రంగంలో రైతులు ఎదుర్కొంటున్న ఫీడ్, సీడ్, ఎగుమతి, విద్యుత్ సరఫరా, రాయితీ తదితర సమస్యలపై నేతలు గళమెత్తారు.

ఈ సందర్భంగా శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ, ఒకప్పుడు దేశంలోనే అగ్రగామిగా ఆక్వా ఉత్పత్తులు, ఎగుమతుల వృద్ధిరేటు ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఆక్వా రంగం – మైనస్ 14.2 శాతానికి పడిపోయిందని వివరించారు.దోచుకునేవాడికి రైతుల కష్టం తెలియదని, పంచభూతాలను తినేస్తున్న జగన్ ను గద్దె దింపితేనే వ్యవసాయ, ఆక్వా రంగాలు బ్రతికి బయటపడతాయని యనమల పిలుపునిచ్చారు.ఆక్వా రైతులకు అప్సడా చట్టం నిబంధనలు, షరతుల పేరుతో సబ్సిడీలు ఎత్తివేసి, ప్రైవేట్ కంపెనీలను జే ట్యాక్స్ పేరుతో దోచుకుంటూ, పరోక్షంగా రైతుని నష్టపరుస్తున్న సీఎం జగన్ రైతు ద్రోహి గా మిగిలిపోతారని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మండిపడ్డారు.

తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక గతంలో ఇచ్చిన సబ్సిడీలు పునరుద్ధరించడంతో పాటు, యూనిట్ విద్యుత్ ను రూపాయిన్నరకే ఆక్వా రైతుకు అందిస్తామని నిమ్మల స్పష్టం చేశారు.

Telugu Andhra Pradesh, Cm Jagan, Palakollumla, Tdp Struggle, Telugudesam-Politic

తెలుగుదేశం నిర్వహించిన ఆక్వా రైతు పోరుబాటలో టీడీపీ నేతలతో పాటు బీజేపీ నేత, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ కూడా పాల్గొనడంతో ఆక్వా రైతుల సమస్యలపై కేంద్రం స్పందించాలంటూ టీడీపీ నేతలు కామినేని దృష్టికి తీసుకెళ్లారు.పార్టీలకతీతంగా ఆక్వా రైతులకోసం పోరాడాల్సిన సమయం వచ్చిందని, కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని కామినేని వారికి భరోసా ఇచ్చారు.విడతల వారీ ఆక్వా రంగ సమస్యల పరిష్కారానికి రైతు పోరుబాట నిర్వహించడమే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే డిసెంబర్ లో రాష్ట్ర మత్స్య శాఖ కమీషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని టీడీపీ నేతలు అల్టిమేటం జారీచేశారు.

అనంతరం ఉండి లోని 220 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ ను ముట్టడించేందుకు వెళ్లిన టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది.ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఆక్వా రైతులకు తెలుగుదేశం అండగా ఉంటుందని టీడీపీ నేతలు స్పష్టం చేశారు.

మరి తెలుగుదేశం ఆందోళనలతో మరోసారి తెరమీదకు వచ్చిన ఆక్వా రైతుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఏవిధంగా స్పందించబోతోంది.ప్రతిపక్షం లేవనెత్తింది కాబట్టి అసలు స్పందిస్తుందా, లేదా.? బీజేపీ నేతల జోక్యంతో కేంద్రం నుండి ఏమైనా ఆక్వారైతుకు చేయూత లభించబోతుందా.? రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలకు మాత్రమే ఇది పరిమితం అవుతుందా.? అసలు కుదేలవుతున్న ఆక్వా రైతును ఆదుకునేవారెవరు.అనేది వేచిచూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube