నాటు సారా తయారీపై ఎక్సైజ్ పోలీసుల దాడులు...!

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం( Narayanapoor ) మండలంలోని కొర్రతండ, బోటిమిది తండా, కడపగండి తండాలలో రామన్నపేట డిటిఎఫ్, యాదాద్రి,ఆలేరు,భువనగిరి,మోత్కూర్ ఎక్సైజ్ శాఖ మరియు సంస్థాన్ నారాయణపురం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గురువారం నాటు సారా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించారు.

ఈ దాడుల్లో ముగ్గురు వ్యక్తులను నుండి నాటు సారాను,బెల్లం పానకం స్వాధీనం చేసుకొని,అలాగే తయారీ స్థావరాలను ధ్వంసం చేసి,సదురు వ్యక్తులపై కేసులు నమోదు చేశారు.

అనంతరం నాటు సారా( Natu sara )(గుడుంబా) నిర్మూలనపై గ్రామాలలో గిరిజనులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో రామన్నపేట ఎక్సైజ్ సిఐ బాలాజీ నాయక్,ఎస్సై శంకర్, యాదాద్రి డిటిఎఫ్ సి ఐ రాధాకృష్ణ,నారాయణపురం ఎస్సై జగన్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

ప్రభుత్వ బడిలో చదివి 2 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు

Latest Video Uploads News