ఇంటర్మీడియట్ విద్య పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించిన జిల్లా కలెక్టర్

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District )లోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు ప్రణాళిక అబద్ధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ( Sandeep Kumar Jha ) అన్నారు.గురువారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఇంటర్మీడియట్ విద్య పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

 District Collector Conducted A Review With Concerned Authorities On Intermediate-TeluguStop.com

సిరిసిల్ల జిల్లాలో ఉన్న జూనియర్ కళాశాలలు, విద్యాశాఖ పరిధిలో ఉన్న ఇంటర్మీడియట్ విద్య సంస్థలు, విద్యార్థుల ఎన్రోల్మెంట్, కోర్సుల వివరాలు, హాజరు మొదలగు వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.సిరిసిల్ల జిల్లాలో మొత్తం 10 జూనియర్ కళాశాలలు, గురుకులాలు, కస్తూర్బా గాంధీ విద్యాలయాలు మొదలైనవి మరో 31 విద్యా సంస్థల్లో ఇంటర్మీడియట్ విద్య బోధించడం జరుగుతుందని అన్నారు.

ఎంపిసి, బైపిసి,సిఈసి,హెచ్ఈసి వంటి రెగ్యులర్ కోర్సులు, మరో 5 ఒకేషనల్ కోర్సులు ఉన్నాయని, సుమారు 3 వేలకు పైగా విద్యార్థులు జిల్లాలో ఇంటర్ విద్య అభ్యసిస్తున్నారని అధికారులు తెలిపారు.జూనియర్ కళాశాలలు, ఇంటర్ ఉన్న ఇతర ప్రభుత్వ విద్యా సంస్థల్లో త్రాగునీటి సరఫరా, కాంపౌండ్ వాల్, టాయిలెట్ల, విద్యుత్ ఫర్నిచర్, అందుబాటులో ఉన్న జూనియర్ లెక్చరర్స్, విద్యార్థుల హాజరు శాతం, మెరుగైన ఫలితాల సాధనకు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలను కలెక్టర్ విద్యా సంస్థల వారీగా రివ్యూ నిర్వహించిన కలెక్టర్ అధికారులకు పోలీసు సూచనలు జారీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటర్ విద్యార్థుల అవసరాల మేరకు సురక్షిత త్రాగు నీటి సరఫరా ఉండాలని, దీని కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ సూచించారు.కళాశాల భవనాల స్థితిగతులు, టాయిలెట్స్, విద్యుత్ పరికరాలు, ఫ్యాన్లు, మౌలిక వసతుల పై అడిగి తెలుసుకున్నారు.

కావాల్సిన అన్ని ఏర్పాట్లపై సమగ్ర నివేదికను ఇవ్వాలని డీఐఈఓను కలెక్టర్ ఆదేశించారు.ఇంటర్ విద్యార్థుల ప్రమాణాలు పెంపొందించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.

ప్రస్తుతం ఉన్న ప్రమాణాల పట్ల కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ మరింత మెరుగు కావాల్సిన అవసరం ఉందని అన్నారు.ఇంటర్ విద్యార్థుల ఆంగ్లము, మ్యాథ్స్, ఎకనామిక్స్ లలో సామర్థ్యం పెంపొందించడం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అదే విధంగా గణితం పట్ల అధిక శ్రద్ద చూపించాలని, పోటీ పరీక్షలో విద్యార్థులకు ఉన్నత విద్యా సంస్థల్లో సీట్లు సాధించేలా బోధించాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో డి.ఐ .ఓ.మోహన్ , కళాశాల ప్రిన్సిపాల్ లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube