పలివెల ఘటనపై ఈటెల పచ్చి అబద్ధాలు:పల్లా

నల్లగొండ జిల్లా:పలివెల ఘటనపై హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నీ అబద్ధాలు మాట్లాడుతున్నారని తెరాస నేత, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి మండిపడ్డారు.

తెరాస కార్యకర్తలపై దాడి చేసేలా భాజపా నేతలే వారి అనుచరులను రెచ్చగొట్టారని ఆరోపించారు.

పలివెల ఘర్షణలో తెరాస శ్రేణుల చేతుల్లో రాళ్లు,కర్రలున్నాయని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్‌ విసిరారు.ఈ మేరకు ఈసీకి,పోలీసులు ఫిర్యాదు చేశామని,దాడిలో ఎవరి తప్పుంటే వారిని శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

Latest Nalgonda News