ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఇ.వి.ఎమ్)  మొదటి స్థాయి తనిఖీ పకడ్బందీ చేపట్టాలి:జిల్లా కలెక్టర్

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఈ నెల 12వ తేదీ నుంచి 19వ తేదీ వరకు సర్దాపూర్ లో చేపట్టనున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఇ.వి.

ఎమ్)  మొదటి స్థాయి తనిఖీ నీ కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పకడ్బందీ చేపట్టాలనీ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు.కలెక్టరేట్ కాన్ఫరెన్స్ మీటింగ్ హల్ నందు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఇ.వి.ఎమ్)  మొదటి స్థాయి తనిఖీ శిక్షణ కార్యక్రమం టేబుల్ సూపర్ వైజర్ లు , టేబుల్ సహాయకులు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి లకు నిర్వహించారు.సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని సర్దాపూర్ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ యార్డ్ లోని గౌడౌన్ -2 లో భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టనున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఇ.వి.ఎమ్)  మొదటి స్థాయి తనిఖీ పకడ్బందీ గా చేపట్టాలన్నారు.ఇందుకు ఉద్దేశించిన మార్గదర్శకాలను ,నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తూ ఫస్ట్ లెవెల్ చెక్ అప్ చేయాలన్నారు.

శిక్షణ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్, ఎన్నికల విభాగం ఉప తహశీల్దార్ రహమాన్ తదితరులు పాల్గొన్నారు.

చేనేత అభయ హస్తము పథకంను ప్రణాళికబద్దంగా అమలు చేయాలి - మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
Advertisement

Latest Rajanna Sircilla News