ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న ఫాస్ట్ ఫుడ్ ట్రెండ్ ఊబకాయంతో పాటు మరో కొత్త ముప్పును తెచ్చిపెడుతోంది.పిజ్జా, బర్గర్ వంటి ఆహార పదార్థాల వల్ల మన రోగ నిరోధక శక్తి దెబ్బతింటున్నదని తేలింది.
లండన్‌లోని ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్‌స్టిట్యూట్ తన తాజా పరిశోధనలో ఈ విషయాన్ని వెల్లడించింది.పాశ్చాత్య దేశాలతో పాటు ఆసియాలోని అనేక దేశాల్లో ఆటో ఇమ్యూన్ వ్యాధి కేసులు పెరుగుతున్నాయని వైద్య పరిశోధకులు తెలిపారు.
పిజ్జా, బర్గర్లు తినడం వలన… మన శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించే రోగనిరోధక వ్యవస్థకు హాని కలుగుతున్నదని ఫలితంగా ఆటో ఇమ్యూన్ సమస్యలు తలెత్తుతున్నాయని వెల్లడయ్యింది.పిజ్జా, బర్గర్ లాంటి ఫాస్ట్ ఫుడ్స్.
ఆటో ఇమ్యూన్ డిసీజ్ కేసులు పెరగడానికి కారణం అంటున్నారు పరిశోధకుడు జేమ్స్ లీ.ఉదాహరణకు, ఆసియా దేశాలలో ఇన్ఫ్లమేటరీ ప్రేగు సిండ్రోమ్ కేసులు పెరుగుతున్నాయి.
ఇది ఉదరానికి సంబంధించిన వ్యాధి.దీనికి ఆహారమే కారణంగా నిలుస్తుంది.పిజ్జా, బర్గర్ వంటి ఫాస్ట్ ఫుడ్‌లు రోగనిరోధక వ్యవస్థ పనితీరును మార్చేస్తున్నాయని పరిశోధకురాలు కరోలా వినేసా తెలిపారు.పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, ఇన్ఫ్లమేటరీ ప్రేగు వ్యాధి, టైప్-1 డయాబెటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటి వ్యాధులు ఆటో ఇమ్యూన్ వ్యాధుల పరిధిలోకి వస్తాయి.
అటువంటి పరిస్థితిలో మన రోగనిరోధక వ్యవస్థ… శరీరంలోని అవయవాలు మరియు కణజాలకు హాని కలిగించడం ప్రారంభిస్తుందన్నారు.వైద్యపరిశోధకురాలు కరోలా మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఫాస్ట్ ఫుడ్ కల్చర్‌ను నియంత్రించడం చాలా కష్టమన్నారు.
యూకేలో కూడా ఆటో ఇమ్యూన్ వ్యాధులు పెరుగుతున్నాయి.ఇక్కడ 40 లక్షల మంది ఈ వ్యాధితో పోరాడుతున్నారు.
అందుకే ఆహారం విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.