శాలిగౌరారం మండలంలో కూలిన డ్రోన్ విమానం...!

నల్లగొండ జిల్లా: శాలిగౌరారం మండలం ఆకారం గ్రామ శివారులోని పంటపొలాలలో ఎగురుతూ వచ్చిన డెమో డ్రోన్ విమానం కూలిన సంఘటన సోమవారం స్థానికంగా కలకలం రేపింది.

ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విమానాన్ని బాంబు స్క్వాడ్ సిబ్బందితో కలిసి పరిశీలించగా బ్యాటరీతో నడిచే ఈ విమానంలో సీసీ కెమెరాలు,జిపిఎస్ సిస్టం ఉందని తేలింది.అయితే దీనిని ఎక్కడి నుంచి ఎవరు పంపారనే విషయం దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

Drone Plane Crashed In Saligauraram Mandal, Drone Plane Crashed ,Saligauraram Ma

డ్రోన్ విమానం ఐదు అడుగుల పొడవు, వెడల్పుతో సుమారు 15 కిలోల బరువు ఉంది.విమానంపై 76 కోడ్ నెంబర్ కూడా ఉండడం గమనార్హం.

ఇద్దరు వ్యక్తులు రెండు కిలోమీటర్ల దూరంలోని వట్టిపాముల గ్రామంలో తాము పంపిన సర్వే విమానం తప్పిపోయిందని ఎవరికైనా కనిపించిందా అంటూ స్థానికులను ఆరా తీస్తున్నట్లు సమాచారం.

Advertisement
కులం పేరుతో దూషించిన ముగ్గురికి ఆరు నెలలు జైలు శిక్ష

Latest Nalgonda News