దగ్గుబాటి రానా( Rana Daggubati ) ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ఆయన చేసిన సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయనకి యాక్టింగ్ లో కూడా చాలావరకు మెళుకువలు తెలియడం లేదు అని అప్పట్లో కొంతమంది ఆయన మీద విమర్శలైతే చేశారు.
ఇక ఇది ఇలా ఉంటే రానా సినిమాలను చూసిన సూర్య( Suriya ).అనుకోకుండా రానాను కలిసినప్పుడు ఆయనతో మాట్లాడి యాక్టింగ్ అంటే ఇది కాదని యాక్టింగ్ అంటే ఎలా చేయాలో చెప్పాడట.
ఈ విషయాన్ని రానాకి చెప్పడం విశేషం…అయితే సూర్య చెప్పిన విషయాలను తెలుసుకున్న రానా ఆ తర్వాత నుంచి తనను తాను నటుడిగా ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నం అయితే చేశాడు.అందులో భాగంగానే భల్లాలా దేవా లాంటి ఒక సాలిడ్ క్యారెక్టర్ లో అద్భుతమైన విలనిజాన్ని పండించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.ఇక ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో వరుసగా చాలా సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు.ఇక ప్రస్తుతం ఆయన కొన్ని సినిమాల్లో హీరోగా చేస్తూనే మరి కొన్ని సినిమాల్లో విలన్ పాత్రలను కూడా చేస్తున్నాడు.
ఇక పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన భీమ్లా నాయక్ సినిమాలో డానియల్ శేఖర్ గా కూడా నటించి అద్భుతమైన ప్రదర్శనలు కనబరిచాడు.ఇప్పుడు ఆయన చేస్తున్న ప్రతిపాత్ర కూడా ప్రేక్షకులు రంజింపజేసేలా ఉంటున్నాయి.
ఇక మొత్తానికైతే మంచి నటుడుగా మంచి గుర్తింపు పొందడానికి రానాకి సూర్య చెప్పిన మాటలు చాలా వరకు హెల్ప్ అయ్యాయనే చెప్పాలి…ఇక మొత్తనికైతే ప్రస్తుతం రానా తేజ డైరెక్షన్లో రాక్షస రాజన్న సినిమా( Rakshasa Raja ) చేస్తున్నాడు.ఈ సినిమాతో భారీ సక్సెస్ను కొట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు కదులుతున్నట్టుగా తెలుస్తోంది…ఈ సినిమాతో ఇటు తేజ, అటు రానా ఇద్దరు కూడా మంచి సక్సెస్ ని అందుకొని మళ్ళీ ఫామ్ లోకి రావాలని ప్రయత్నం చేస్తున్నట్లు గా తెలుస్తుంది…
.