Keerthy Suresh: పాపం కీర్తి సురేష్…ఏంటి నీకు ఈ కర్మ.. వరసగా చిన్న హీరోలతోనే జోడి !

మహానటి సినిమా ఏ ముహూర్తాన విడుదల అయిందో కానీ కీర్తి సురేష్( Keerthy Suresh ) జాతకం పూర్తిగా మారిపోయింది.ఈ సినిమా భారీ హిట్టు కొట్టి నేషనల్ అవార్డు అయితే దక్కించుకుంది కానీ అదే ఆమెకు శాపంగా మారింది.

 What Happened To Keerthy Suresh-TeluguStop.com

ఆ తర్వాత అనేక సినిమాలు పరాజయం బాట పట్టాయి.ప్రతి సినిమాను మహానటి తో పోల్చి చూసి కీర్తి సురేష్ శక్తిని అంచనా వేసే పరిస్థితికి వచ్చారు.

అయితే ఆ పరిస్థితి మెళ్ళి మెళ్ళి గా తగ్గుతూ వచ్చింది.ఇటీవల మహేష్ బాబు వంటి స్టార్ హీరోతో జోడి కట్టి మొట్టమొదటిసారిగా హిట్ అందుకుంది.

దాదాపు పది సినిమాల ప్లాప్స్ తర్వాత ఆమెకు ఆ చిత్రం మంచి పేరును తీసుకొచ్చింది.ఇప్పుడు మరొక కొత్త చిక్కు వచ్చి పడింది .ఆమె వరుసగా చిన్న హీరోలతోనే సర్దుకోవాల్సి వస్తుందట.

Telugu Arvind Krishna, Keerthy Suresh, Mahanati, Mahesh Babu, Naveen Chandra, Su

తాజాగా సుహాస్ తో కీర్తి సురేష్ ఓ సినిమాలో నటిస్తున్నట్టు అఫీషియల్ వార్త రాగానే అందరికీ కీర్తి సురేష్ కి ఏమైంది ఎందుకు ఇంత చిన్న సినిమా హీరోలతో నటిస్తుంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.ఇప్పుడు సుహాస్ మాత్రమే కాదు ఇంతకు ముందు కూడా ఆమె చాలామంది చిన్న హీరోలతో పని చేసింది.మహేష్ బాబు ( Mahesh Babu )ఒక్కడే ఈమె గత సినిమాల్లో పెద్ద హీరో కాగా, నాని కూడా మీడియం రేంజ్ హీరోనే.

ఈ సినిమా కన్నా ముందు చిరంజీవి హీరోగా వచ్చిన భోళాశంకర్ కి సినిమాలో సుశాంత్( Sushanth ) సరసన లీడ్ పాత్రలో నటించింది కీర్తి సురేష్.తెలుగులో మాత్రమే కాదు తమిళంలో వచ్చిన పెద్దన్న చిత్రంలో కూడా ఆమె ఒక చిన్న హీరో సరసన నటించింది.

రజనీకాంత్ హీరోగా వచ్చిన పెద్దన్న చిత్రంలో కీర్తి సురేష్ అరవింద్ కృష్ణ ( Arvind Krishna )అనే ఒక చిన్న నటుడి సరసన నటించాల్సి వచ్చింది.

Telugu Arvind Krishna, Keerthy Suresh, Mahanati, Mahesh Babu, Naveen Chandra, Su

ఇక మిస్ ఇండియా సినిమాలో నవీన్ చంద్ర( Naveen Chandra ) పక్కన హీరోయిన్ గా నటించింది.కీర్తి తెలుగులో ఏమాత్రం ఫెమ్ లేని నవీన్ చంద్ర తో నటించడం ఏంటి అని అందరూ నోరెళ్ళ పెట్టారు.ఇప్పుడు ఒకటి రెండు విజయాలు తన ఖాతాలో వేసుకోగానే సుహాస్ పెద్ద హీరోల బిల్డప్ ఇస్తూ వస్తున్నాడు.

దీంతో పాటు ఇప్పుడు కీర్తి సురేష్ అతడి పక్కన హీరోయిన్ గా నటిస్తుంది అనగానే మరో రేంజ్ కి వెళ్ళినట్టుగా ఆకాశంలో తేలిపోతున్నాడు.మరి కీర్తి సురేష్ కి మాత్రం ఏం కంగారు వచ్చిందో తెలియదు.

ఇలా ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకొని చిన్న హీరోల సరసన నటిస్తూ వెళుతుంది.ఇది కీర్తి కెరీర్ కి మైనస్ పాయింట్ అని కొంతమంది అంచనా వేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube