నందమూరి వంశం నుంచి వచ్చిన హీరోల్లో బాలయ్య, ఎన్టీయార్, కళ్యాణ్ రామ్ లతో పాటు మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో తారకరత్న…ఆయన ఆకస్మిక మరణం అయన కుటుంబంలోనూ , అభిమానుల్లోనూ తీవ్ర విషాదం నింపింది .తారకరత్న( Taraka Ratna ) మరణించిన తరువాత అతని భార్య అలేఖ్యా రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేస్తోన్న పోస్టులు, చెబుతున్న విషయాలు, జీవితంలో ఎదుర్కొన్న అవమానాలు, పడ్డ బాధలను తెలుసుకుని అందరూ కూడా చలించి పోతున్నారు .
కుటుంబం అంతా కూడా వెలివేసిందంటూ, అయినా ధైర్యంగా నిలబడి బతికామంటూ అలేఖ్యా రెడ్డి( Alekhya reddy ) చెబుతున్న విషయాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూనే , ఆవేదన చెందేలా చేస్తున్నాయి .ఇక ఇప్పుడిప్పుడే తారక రత్న మరణం కలిగించిన బాధ నుంచి ఆయన భార్య అలేఖ్యా రెడ్డి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నారు.భర్త లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది.తారక రత్న మరణం నుంచి ఆయన్ను తలుచుకుంటూ, ఆ జ్ఞాపకాలతో అలేఖ్యా రెడ్డి భావోద్వేగానికి గురి అవుతున్నారు .

మానసిక ప్రశాంతత కోసం మెడిటేషన్ చేయాలని నిర్ణయించుకున్నారు .ఇందుకోసం ఆమె కోయంబత్తూరు వెళ్లారు ఇషా ఫౌండేషన్ లో ఆమె మెడిటేషన్ చేయనున్నారు .పెద్దమ్మాయి నిష్క, అలేఖ్య కొన్ని రోజులు అక్కడ ఉండనున్నట్టు తెలుస్తుంది .కోయంబత్తూరులోని ఇషా ఆశ్రమానికి పలువురు ప్రముఖులు, సామాన్య ప్రజలు వెళుతూ ఉంటారు.ప్రశాంతత కోసం యోగ చేస్తూ ఉంటారు.

అలేఖ్యా రెడ్డి కూడా కొన్ని రోజులు మెడిటేషన్ చేసిన తర్వాత హైదరాబాద్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.ఇక తారక రత్న భౌతికంగా మనమధ్య లేకపోయినా ఆయన జ్ఞాపకాలు ఎప్పుడూ ప్రజలతోనే ఉంటాయి .ముఖ్యంగా ఆయన సతీమణి అలేఖ్యా రెడ్డి పిల్లలలో భర్తను చూసుకుంటున్నారు.తారక రత్న, అలేఖ్యా రెడ్డి దంపతులకు ముగ్గురు పిల్లలు.పెద్దమ్మాయి పేరు నిష్క.నిష్క తర్వాత కవలలు జన్మించారు.ఆ ఇద్దరిలో ఒకరు అమ్మాయి, మరొకరు అబ్బాయి.
ఇక అలేఖ్య రెడ్డి కి నందమూరి బాలకృష్ణ( Balakrishna ) అండగా ఉంటున్నారు .ఇప్పటికే పిల్లల బాధ్యత కూడా తీసుకున్నారు .ఇటీవల అలేఖ్య రెడ్డి కూడా బాలయ్య తమ మీద చూపుతున్న ప్రేమని సోషల్ మీడియా ద్వారా తెలియచేసి కృతజ్ఞత చెప్పుకుంది ,.
