దసరా సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా... ఎవరీ శ్రీకాంత్!

శ్రీకాంత్ ఓదెల(Sreekanth Odela) ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మారుమోగుతున్న పేరు.నాని(Nani) హీరోగా నటించిన దసరా(Dasara) సినిమాకు దర్శకుడిగా ఈయన ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

 Do You Know The Background Of Dasara Movie Director Srikanth Odela Every Srikant-TeluguStop.com

అయితే మొదటి సినిమాతోనే ఈయన పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడమే కాకుండా అద్భుతమైన హిట్ అందుకోవడంతో ప్రస్తుతం శ్రీకాంత్ గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో తెరికెక్కిన దసరా సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమా మార్చి 30 తేదీ విడుదల అయ్యి అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది.ఇలా మొదటి సినిమాతోనే పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అందుకున్న శ్రీకాంత్ ఎవరు ఏంటి అని ఆరా తీస్తున్నారు.

Telugu Dasara, Rangasthalam, Sreekanth Odela, Sukumar-Movie

ఇలా దసరా సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకున్నటువంటి శ్రీకాంత్ కరీంనగర్ జిల్లా సింగరేణి ప్రాంతానికి చెందిన వారిని తెలుస్తుంది.చిన్నప్పటినుంచి సినిమాలపై ఆసక్తి ఉండడంతో ఈయన అడుగులు ఇండస్ట్రీ వైపు పడ్డాయి.ఇలా షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ అనంతరం ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.ఈయన చేసినటువంటి టు ఫాదర్ విత్ లవ్ అనే షార్ట్ ఫిలిం ఎన్నో అవార్డులను అందుకుంది.

ఇలా 2016 సంవత్సరం తర్వాత ఈయన ఇండస్ట్రీలోకి అసిస్టెంట్ డైరెక్టర్ గా అడుగుపెట్టారు.

Telugu Dasara, Rangasthalam, Sreekanth Odela, Sukumar-Movie

ఇక శ్రీకాంత్ శిష్యరికం చేసినది మరెవరి దగ్గరో కాదు మన లెక్కల మాస్టర్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) దగ్గర ఈయన శిష్యరికం చేశారు.ఇలా సుకుమార్ దగ్గర రంగస్థలం (Rangasthalam) సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా ఈయన పని చేశారు.ఈ విధంగా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న శ్రీకాంత్ అనంతరం నానితో ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో సినిమా చేసే హిట్ కొట్టారు.

ఇలా ఒక కొత్త దర్శకుడు చాలా ధైర్యంతో భారీ బడ్జెట్ సినిమాని చేస్తూ స్థాయిలో విడుదల చేయడం అంటే మామూలు విషయం కాదు.ఇలా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో డైరెక్టర్ శ్రీకాంత్ కి ఇండస్ట్రీలో ఇకపై మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశాలు లేకపోలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube