తారక రత్న భార్య ఇప్పుడు ఎక్కడుంటుందో తెలుసా..?

నందమూరి వంశం నుంచి వచ్చిన హీరోల్లో బాలయ్య, ఎన్టీయార్, కళ్యాణ్ రామ్ లతో పాటు మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో తారకరత్న.

ఆయన ఆకస్మిక మరణం అయన కుటుంబంలోనూ , అభిమానుల్లోనూ తీవ్ర విషాదం నింపింది .

తారకరత్న( Taraka Ratna ) మరణించిన తరువాత అతని భార్య అలేఖ్యా రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేస్తోన్న పోస్టులు, చెబుతున్న విషయాలు, జీవితంలో ఎదుర్కొన్న అవమానాలు, పడ్డ బాధలను తెలుసుకుని అందరూ కూడా చలించి పోతున్నారు .

కుటుంబం అంతా కూడా వెలివేసిందంటూ, అయినా ధైర్యంగా నిలబడి బతికామంటూ అలేఖ్యా రెడ్డి( Alekhya Reddy ) చెబుతున్న విషయాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూనే , ఆవేదన చెందేలా చేస్తున్నాయి .

ఇక ఇప్పుడిప్పుడే తారక రత్న మరణం కలిగించిన బాధ నుంచి ఆయన భార్య అలేఖ్యా రెడ్డి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నారు.

భర్త లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది.తారక రత్న మరణం నుంచి ఆయన్ను తలుచుకుంటూ, ఆ జ్ఞాపకాలతో అలేఖ్యా రెడ్డి భావోద్వేగానికి గురి అవుతున్నారు .

"""/" / మానసిక ప్రశాంతత కోసం మెడిటేషన్ చేయాలని నిర్ణయించుకున్నారు .

ఇందుకోసం ఆమె కోయంబత్తూరు వెళ్లారు ఇషా ఫౌండేషన్ లో ఆమె మెడిటేషన్ చేయనున్నారు .

పెద్దమ్మాయి నిష్క, అలేఖ్య కొన్ని రోజులు అక్కడ ఉండనున్నట్టు తెలుస్తుంది .కోయంబత్తూరులోని ఇషా ఆశ్రమానికి పలువురు ప్రముఖులు, సామాన్య ప్రజలు వెళుతూ ఉంటారు.

ప్రశాంతత కోసం యోగ చేస్తూ ఉంటారు. """/" / అలేఖ్యా రెడ్డి కూడా కొన్ని రోజులు మెడిటేషన్ చేసిన తర్వాత హైదరాబాద్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇక తారక రత్న భౌతికంగా మనమధ్య లేకపోయినా ఆయన జ్ఞాపకాలు ఎప్పుడూ ప్రజలతోనే ఉంటాయి .

ముఖ్యంగా ఆయన సతీమణి అలేఖ్యా రెడ్డి పిల్లలలో భర్తను చూసుకుంటున్నారు.తారక రత్న, అలేఖ్యా రెడ్డి దంపతులకు ముగ్గురు పిల్లలు.

పెద్దమ్మాయి పేరు నిష్క.నిష్క తర్వాత కవలలు జన్మించారు.

ఆ ఇద్దరిలో ఒకరు అమ్మాయి, మరొకరు అబ్బాయి.ఇక అలేఖ్య రెడ్డి కి నందమూరి బాలకృష్ణ( Balakrishna ) అండగా ఉంటున్నారు .

ఇప్పటికే పిల్లల బాధ్యత కూడా తీసుకున్నారు .ఇటీవల అలేఖ్య రెడ్డి కూడా బాలయ్య తమ మీద చూపుతున్న ప్రేమని సోషల్ మీడియా ద్వారా తెలియచేసి కృతజ్ఞత చెప్పుకుంది ,.

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోంది..: సీఎం రేవంత్