పానీపూరీ.ఈ వంటకాన్ని చిన్న వాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకు ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా తింటూ ఉంటారు.పానీ పూరీ అంటే ఇష్టం ఉండని వాళ్లు ఉండరేమో.కరోనా లాక్ డౌన్ లో పానీ పూరీ తినడం కుదరడం లేదని చాలా మంది నిరాశను వ్యక్తం చేశారు.
అటువంటి పానీ పూరీ గురించి ఎటువంటి వార్త అయినా సరే వైరల్ అవుతుంది.పానీ పూరీని తినడం మంచిదా? మంచిది కాదా? అనే విషయాన్ని గురించి చాలా మంది చాలా రకాలుగా చెప్పినా కానీ పానీ పూరీని తినేవారు పెద్దగా పట్టించుకోరు.వారు వారికి కావాల్సిందే చేస్తూ ఉంటారు.తాజాగా పానీ పూరీ గురించి ఒక వార్త బాగా వైరల్ అవుతోంది.
ఆ వార్తను పలువురు డాక్టర్లు కూడా నిజమే అని ధృవీకరిస్తున్నారు.ఇంతకీ ఆ వార్త సారాంశం ఏమిటంటే.
అతి బరువు సమస్యతో నేటి రోజుల్లో చాలా మంది బాధపడుతున్నారు.వారు తమ బరువును తగ్గించుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తారు.
ఇలా ప్రయత్నాలు చేసే వారు ప్రస్తుత రోజుల్లో చాలా మందే ఉన్నారు.ఇలా బరువు తగ్గేందుకు చూసే వారు పానీ పూరీలు తినడం అంత మంచిది కాదని డాక్టర్లు చెబుతున్నారు.
వీరు పానీపూరీలు తింటూ పానీ పూరీ నీటిని తాగడం వలన క్యాలరీలు పెరుగుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.పానీ పూరీ నీటిలో జీలకర్ర, చింతపండు, పూదీనా వేసి తయారు చేస్తారని కానీ ప్రస్తుత రోజుల్లో ఎవరూ ఇలా తయారు చేయడం లేదని చెబుతున్నారు.
రెడీ టూ మిక్స్ మసాలాలను ఎక్కువగా వాడుతున్నారని పేర్కొంటున్నారు.ఈ మసాలాలు ఆరోగ్యానికి చాలా హనికరమట.
ముఖ్యంగా బరువు తగ్గేందుకు చూసే వారికి ఈ మసాలాలు చాలా హానికరం అని వైద్యులు సూచిస్తున్నారు.అందుకోసం బరువును తగ్గించుకోవాలని చూసే వారు పానీపూరీలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు.