కలియుగ దైవంగా సాక్షాత్తు ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని పూజిస్తాము.భక్తులకు కోరిన కోరికలను తీరుస్తూ ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటారు.
ఇప్పటివరకు మనం తిరుమల గురించి ఎన్నో విశేషాలను స్వామి వారి పూజా కార్యక్రమాలను, స్వామివారి విశిష్టతను గురించి తెలుసుకొని ఉంటాం.కానీ చాలామంది స్వామి వారి సన్నిధిలో కేవలం స్వామి వారి విగ్రహం మాత్రమే కాకుండా మరొక ఐదు విగ్రహాలు కూడా ఉన్నాయి.
వీటి గురించి చాలా మందికి తెలియదు.మరి ఆ విగ్రహాలు ఏమిటి వాటి ప్రాముఖ్యత ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
మూలమూర్తి:
నిత్యం లక్షలాదిమంది భక్తులు దర్శించుకునే మూలవిరాట్ ను మూలమూర్తి లేదా ధ్రువబేరం అని పిలుస్తారు.ధ్రువ అంటే స్థిరంగా ఉండేదని అర్ధం.
ధ్రువ బేరానికి వేకువజామున సుప్రభాత సేవ నుంచి అర్ధరాత్రి ఏకాంతసేవ వరకూ నిరంతరం ఆరాధనలు జరుగుతుంటాయి.వీర స్థానిక పద్ధతిలో నిలబడి ఉన్న మూలవిరాట్టు పక్కన శ్రీదేవి భూదేవి విగ్రహాలు ఉండవు.
భోగ శ్రీనివాసమూర్తి:
భోగ శ్రీనివాసుడు కేవలం ఒక అడుగు ఎత్తులో ఉండి నిత్యం జరిపే దీపారాధన నైవేద్యం ఏకాంత సేవలు భోగ శ్రీనివాస మీద కూడా జరుగుతాయి.క్రీస్తుశకం 614 సంవత్సరం నుంచి ఈ విగ్రహాన్ని ఇప్పటివరకు ఒక్క సారి కూడా ఆలయం నుంచి బయటకు తీయలేదు.స్వామివారి మూలవిరాట్ కి చేసే పూజా కార్యక్రమాలు అన్ని ఈ భోగ శ్రీనివాసమూర్తి కూడా జరుగుతాయి.
ఉగ్ర శ్రీనివాసమూర్తి:
ఉగ్ర శ్రీనివాసమూర్తిని స్నపన బేరం అంటారు.ఉగ్ర శ్రీనివాసుడు భూదేవి శ్రీదేవి సమేతంగా ఉండి క్రీస్తుశకం 11వ శతాబ్దం వరకూ ఉత్సవ మూర్తిగా ఉండేది.అయితే ఓసారి ఉత్సవాలలో భాగంగా అగ్ని ప్రమాదం సంభవించడంతో అప్పటి నుంచి స్వామివారికి ఉగ్ర శ్రీనివాసమూర్తి అనే పేరు వచ్చింది.అలా ప్రమాదం జరిగిన తర్వాత కేవలం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే స్వామివారిని స్వర్ణ అలంకారంతో ఎంతో అందంగా అలంకరించి ఊరేగింపుగా తీసుకు వెళతారు.
మలయప్ప స్వామి:
పదమూడవ శతాబ్దంలో అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత ఉగ్ర నరసింహ మూర్తిని ఊరేగింపుగా తీసుకు వెళ్లడం మానేశారు.ఈ క్రమంలోనే శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్పస్వామిని ఉత్సవాలలో ఊరేగింపుగా తీసుకు వెళ్లేవారు.ఈ విధంగా స్వామి వారిని ఉత్సవాలలో తీసుకు వెళ్లడం వల్ల ఈ విగ్రహాలను ఉత్సవబేరం అని కూడా పిలుస్తారు.
కొలువు శ్రీనివాసమూర్తి:
గర్భగుడిలో స్వామి వారి మూలవిరాట్టు పక్కన ఉన్నటువంటి చిన్న విగ్రహాన్ని కొలువు శ్రీనివాసమూర్తి అని పిలుస్తారు.మూలవిరాట్టుకు తోమాలసేవ చేసిన తర్వాత కొలువు శ్రీనివాసమూర్తికి బంగారు సింహాసనంపై ఉంచి పంచాంగ శ్రవణం చేస్తారు.ఈ విధంగా స్వామివారి సన్నిధిలో మరో ఐదు విగ్రహాలు ఉండి విశేష పూజలను అందుకుంటున్నాయి.
DEVOTIONAL