సరికొత్త చట్టాలపై అవగాహన పోస్టర్ ను విడుదల చేసిన జిల్లా ఎస్పీ

సూర్యాపేట జిల్లా:సరికొత్త చట్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయం ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ( Sun preet singh )ప్రజా అవగాహన పోస్టర్ ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వం జూలై 1వ తేదీ నుండి అమల్లోకి తెచ్చిన సరికొత్త న్యాయ చట్టాలను జిల్లాలో పటిష్టంగా అమలు చేస్తామన్నారు.

ఇప్పటి వరకు అమలులో ఉన్న చట్టాల స్థానంలో అమలులోకి వచ్చిన భారతీయ నాగరిక్ సురక్ష సంహిత,భారతీయ సాక్ష్యా అధినియం,భారతీయ న్యాయ సంహిత కొత్త చట్టాలపై సిబ్బంది నైపుణ్యం సాధించేలా,నాణ్యమైన దర్యాప్తు చేసేలా జిల్లా పోలీసు అధికారులకు,సిబ్బంది అందరికీ శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగిందన్నారు.ఈ కొత్త చట్టం పరిధిలో వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా 170 కేసులు నమోదు చేయడం జరిగినదని, చట్టాలను అతిక్రమించకుండా పౌరులు బాధ్యతగా నడుచుకోవాలని,చట్టాలను గౌరవించాలన్నారు.

District SP Released Awareness Poster On New Laws , District SP , Sun Preet Si

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, డిఎస్పీ శ్రీధర్ రెడ్డి,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వీరరాఘవులు,సీఐలు చరమందరాజు,రఘువీర్ రెడ్డి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

ఫస్ట్ లవ్ ఎప్పటికీ మర్చిపోలేను... ఇన్నాళ్లకు ఓపెన్ అయిన సమంత... చైతన్య గురించేనా?
Advertisement

Latest Suryapet News