గ్రీవేన్స్ ఫిర్యాదులు పరిశీలించిన జిల్లా ఎస్పీ చందనా దీప్తి...!

నల్లగొండ జిల్లా( Nalgonda District )ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే( Grievance Day ) లో భాగంగా ఈ రోజు జిల్లా పోలీసు కార్యాలయం( District Police Office )లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు 40 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి తమ సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు.

ఈ రోజు వచ్చిన ఫిర్యాదులు భూ సమస్యలు,భార్యభర్తల మధ్య విభేదాలు,ఫైనాన్స్ సమస్యలపైన ఫిర్యాదులు రావడం జరిగిందని తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామన్నారు.పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి వేగంగా స్పందించి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని, ఫిర్యాదుదారునికి భరోసా, నమ్మకం కలిగించాలన్నారు.

చట్టవ్యతిరకమైన చర్యలు చేస్తూ శాంతిభద్రతలకు భంగం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అన్నారు.బాధితుల యొక్క ప్రతి ఫిర్యాదును ఆన్ లైన్ లో పొందుపరుస్తూ నిత్యం పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు.

సైరన్ తో వచ్చేది పోకిరీలా...పోలీసులా...?
Advertisement

Latest Nalgonda News