విడిపోవడమే చైతన్య సమంత పాలిట శాపమైందా.. ఇద్దరికీ ఫ్లాపులే మిగిలాయిగా?

చైతన్య సమంత ప్రేమ, పెళ్లి గురించి ప్రకటనలు వెలువడిన సమయంలో ఇద్దరి అభిమానులు తెగ సంతోషించారు.కలకాలం ఈ జోడీ అన్యోన్యంగా ఉండి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుందని అందరూ భావించారు.

 Differences Between Chaitanya And Samantha Details Here Goes Viral In Social Me-TeluguStop.com

పెళ్లి తర్వాత మూడేళ్ల పాటు చైసామ్ సంతోషంగా ఉన్నారు.సమంత హోస్ట్ చేసిన సామ్ జామ్ షో( Samjam Show )కు చైతన్య గెస్ట్ గా హాజరై ఎన్నో సీక్రెట్స్ ను పంచుకున్నారు.

చైసామ్ కాంబినేషన్( Chay Sam ) సూపర్ హిట్ కాంబినేషన్ అనిపించుకుంది.

ఈ కాంబినేషన్ లో నాలుగు సినిమాలు తెరకెక్కగా ఆ సినిమాల్లో మూడు సినిమాలు కమర్షియల్ సక్సెస్ సాధించాయి.

అయితే విడిపోవడమే అటు చైతన్య( Naga Chaitanya ) కెరీర్ కు ఇటు సమంత కెరీర్ కు శాపమైందని కామెంట్లు వినిపిస్తున్నాయి.చైతన్య సమంత విడిపోవడానికి కొన్నిరోజుల ముందే చైతన్య హీరోగా తెరకెక్కిన లవ్ స్టోరీ మూవీ విడుదలై కమర్షియల్ గా సక్సెస్ సాధించింది.

ఆ తర్వాత నాగచైతన్య నటించిన మూడు సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి.

ఈ సినిమాలలో బంగార్రాజు( bangarraju ) మల్టీస్టారర్ కాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ రిజల్ట్ ను అందుకుంది.థాంక్యూ, లాల్ సింగ్ చడ్డా సినిమాలు మాత్రం బయ్యర్లకు భారీ నష్టాలను మిగిల్చాయి. కస్టడీ( Custody ) సినిమాపై నాగచైతన్య ఆశలు పెట్టుకోగా ఈ ఏడాది మే నెలలో ఈ సినిమా రిలీజవుతోంది.

మరోవైపు విడాకుల తర్వాత సమంత( Samantha ) పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ చేసినా ఆ సినిమా సక్సెస్ ను సామ్ ఖాతాలో వేయలేము.

ఫ్యామిలీ మేన్ వెబ్ సిరీస్( Family Man ) సక్సెస్ అయినా ఆ సినిమాలోని బోల్డ్ రోల్ సమంతను ఫ్యామిలీ ఆడియన్స్ కు దూరం చేసింది.యశోద సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలవగా శాకుంతలం( Shaakuntalam ) డిజాస్టర్ అయింది.సమంత చేతిలో ఆఫర్లు ఉన్నా మరీ ఎక్కువ ఆఫర్లు లేవు.

విడాకుల తర్వాత సమంతను ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి.విడిపోవడమే చైతన్య సమంత పాలిట శాపమైందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube