నల్లగొండలో ఖర్గే సభకు పోటెత్తిన జనసంద్రం

నల్లగొండ జిల్లా:కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే( Mallikarjuna Kharge ) పాల్గొన్న నల్లగొండ ప్రజా భరోసా సభకు జనం పోటెత్తారు.

గురువారం జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీని గద్దె దించాలన్న కృతనిశ్చయంతో బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు కదంతొక్కారు.

సభా ప్రాంగణంలో మాత్రమే కాదు,నల్గొండ పురవీధులన్నీ కిటకిటలాడిపోయాయి.ఎక్కడ చూసినా కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది.

Crowds Flocked To Kharge Sabha In Nalgonda , Nalgonda, Kharge Sabha, Komati Redd

బతుకమ్మ పాటలు, కోలాట నృత్యాలతో ర్యాలీలు కన్నుల పండువగా సాగాయి.అందరిలో ఒకటే కసి కేసీఆర్ దుర్మార్గపు కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి.

జనహృదయ నేత కోమటిరెడ్డి వెంకన్నను( Komati Reddy Venkannan ) భారీ మెజారిటీతో గెలిపించాలి,కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కించాలనే నినాదాలతో హోరెత్తించారు.ముందుగా అనుకున్న షెడ్యూల్ కు రెండు గంటలు ఆలస్యం అయినా ఇనుమడించిన ఉత్సాహంతో ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

ఖర్గేను వెంట తోడ్కొని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్టేజ్ పైకి రాగానే కార్యకర్తలు ఉత్సాహంతో కేరింతలు కొట్టారు.ఈలలు చప్పట్లతో ఒక్కసారిగా సభ యావత్తూ దద్దరిల్లిపోయింది.

"జయహో వెంకన్నా.జై కాంగ్రెస్" నినాదాలు మిన్నంటిపోయాయి.

అనంతరం సభికులు ఖర్గే ఉపన్యాసం ఓపికగా విన్నారు.కేసీఆర్ఎ లా మోసం చేశాడో ఆయన వివరించారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అమలు చేయనున్న 6 గ్యారెంటీల గురించి వివరంగా చెప్పారు.దశాబ్దం క్రితం నీళ్లు, నిధులు,నియామకాల కోసం వందలాది నిరుద్యోగ యువత ప్రాణ త్యాగం చేశారని,ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన పదవికి రాజీనామా చేశారని, తెలంగాణ కంటే తనకు పదవులు ముఖ్యం కాదంటూ మంత్రి పదవిని తృణప్రాయంగా భావించి ఉద్యమబాట పట్టి,ఆమరణ దీక్ష చేశారని,తర్వాత ఉద్యమం మరింత ఉధృత రూపం దాల్చిందని,కోదండరాం కన్వీనర్ గా అన్ని పక్షాలు సంఘటితంగా పోరాడాయని,దీంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ ప్రకటించారని గుర్తు చేశారు.

అయితే కోమటిరెడ్డి లాంటి నాయకులతో పాటు మొత్తం తెలంగాణ ప్రజానీకం ఈ విజయానికి కారణం కాగా క్రెడిట్ మొత్తం తనదే అన్నట్లుగా కేసీఆర్ ప్రచారం చేసుకొని, మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడని,కానీ,పదేళ్లుగా అధికారంలో ఉంటూ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చకుండా వంచించాడని,కుటుంబ పాలనతో ప్రజలు విసుగెత్తి పోయారని అన్నారు.దీంతో ప్రస్తుతం వాడవాడనా కేసీఆర్ పై ఆగ్రహం పెల్లుబుకుతోందని,ఈ రోజు ఈ సభ సందర్భంగా ఆ విషయం స్పష్టంగా వెళ్లడయిందన్నారు.

Advertisement

రెండు రోజుల క్రితం ఇదే నల్గొండలో జరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు జనాలు లేక ఖాళీ కుర్చీలు వెక్కిరించాయని,ఈ జనసంద్రాన్ని చూస్తే కాంగ్రెస్ గెలుపును ఎవరూ ఆపలేరని అన్నారు.

Latest Nalgonda News