ప్రపంచంలో ఎన్ని రకాల క్రీడలున్నా క్రికెట్‌కి వున్న ప్రత్యేకతే వేరు.క్రికెట్‌కి చాలా ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది.
ఇక ఒక్కసారి క్రికెట్ చరిత్ర తిరగేస్తే, ఎన్నో అద్భుతమైన రికార్డ్‌లు మనకు కనిపిస్తాయి.కాగా ఆయా రికార్డుల్ని వేరెవ్వరూ టచ్ చేయలేని రకంగా సదరు క్రీడాకారులు సెట్ చేయడం విశేషం.
అలా కొన్ని రికార్డులు ఎప్పటికీ బద్దలు కాకుండా అలానే పదిలంగా వున్నాయి.ఇపుడు అవేంటో చూద్దాం.
ఇక్కడ మొదటిసారి మన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గురించి మాట్లాడుకోవాలి.క్రికెట్ చరిత్రలో సచిన్ టెండూల్కర్ పేరిటి ఎన్నో రికార్డులు నమోదయ్యాయి.ఈ నేపథ్యంలో అత్యధిక పరుగుల లిస్టులో లిటిల్ మాస్టర్ అగ్రస్థానంలో నిలిచాడు.అత్యధిక అంతర్జాతీయ పరుగులు 34,357 కాగా, ఈ రికార్డును బ్రేక్ చేయడం అనేది ఇప్పట్లో కాని పని.మళ్ళీ సచిన్ టెండూల్కర్ పుట్టి రావాలని క్రికెట్ ఉద్దండులు జోష్యం చెబుతారు.అలాగే అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు (100) రికార్డ్ కూడా సచిన్ పేరిట ఉండటం కొసమెరుపు.
ఇలా ఈ లిస్టులో విరాట్ కోహ్లీ 70+ సెంచరీలతో 2వ స్థానంలో వున్నాడు.ఇక రోహిత్ శర్మను తీసుకుంటే అత్యధిక వన్డే వ్యక్తిగత స్కోరు 264 పరుగులు చేసి ఈ లిస్టులో 3వ స్థానంలో వున్నాడు.ఇకపోతే ఆస్ట్రేలియా దిగ్గజ ప్లేయర్ డాన్ బ్రాడ్‌మన్ తన టెస్ట్ కెరీర్‌లో 99.94 సగటుతో పరుగులు సాధించి 4వ స్థానంలో వున్నాడు.కాగా ఈ నంబర్‌ను కూడా అందుకోవడం దాదాపు అసాధ్యం.జిమ్ లేకర్ ఒక టెస్టులో అత్యధిక వికెట్లు (19) పడగొట్టి, చరిత్ర సృష్టించాడు.ఈ రికార్డును చేరుకోవాలని ప్రతీ బౌలర్ ప్రయత్నిస్తూనే ఉంటారు.కానీ, ఇప్పటి వరకు ఎవరూ చేరలేకపోయారు.