భారత్‌లో పెరుగుతున్న కోవిడ్ పాజిటివ్ కేసులు...!

ఢిల్లీ/నల్లగొండ జిల్లా: భారత్‌లో కోవిడ్ పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.గడిచిన 24 గంటల్లో 819 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

వీటిలో అత్యధికంగా కర్ణాటక( Karnataka )లో 279 కేసులు నమోదు కాగా,మహారాష్ట్రలో 61, కేరళలో 54 కేసులు నమోదయ్యాయి.దీంతో మొత్తం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,049కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

Covid Positive Cases Are Increasing In India , Corona Cases, India , Karnataka

గత 24 గంటల్లో ఆరుగురు కరోనా( Corona ) కారణంగా మృతి చెందారు.ఈ నేపథ్యంలోనే 889 మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు.JN.1 సబ్ వేరియంట్‌ కారణంగా రోజువారీ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.మరోవైపు దేశవ్యాప్తంగా మరణాలు సంఖ్య కూడా క్రమంగా పెరగడం పట్ల ప్రజల్లో భయాందోళన మొదలైంది.

అంతేకాదు చల్లని వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఈ వైరస్ మరింత విస్తరిస్తోందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.ఇలాంటి క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కువగా రద్దీ ఉండే ప్రాంతాలకు వెళ్లే సమయాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు.

Advertisement

Latest Nalgonda News