సాగర్ కు కొనసాగుతున్న వరద ప్రవాహం..!

నల్లగొండ జిల్లా: కృష్ణమ్మ పరుగులుతో సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది.శనివారం నాటికి నీటిమట్టం 571.

80 అడుగులకు చేరింది.శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం భారీగా కొనసాగుతోంది.

Continued Flood Flow To Sagar Reservoir, Flood Flow ,Sagar Reservoir, Nagarjuna

జలాశయం 10 గేట్లను 20 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.శ్రీశైలం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 4లక్షల 58వేల 393 క్యూసెక్కులు ఇన్‌ ఫ్లో వస్తుండగా.

ఔట్ ఫ్లో 4లక్షల 26వేల 560 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు.శ్రీశైలం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా.

Advertisement

ప్రస్తుతం 204 టీఎంసీల నీటి నిల్వ ఉంది.జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

సాగర్ ‌దిశగా పరుగులు పెట్టడంతో సాగర్‌కు కూడా జలకళ వచ్చింది.ఎగువ నుంచి వచ్చిన వరద సాగర్‌ క్రస్ట్‌ గేట్లను తాకింది.నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు 4 లక్షల 58 వేల 393 క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో ఉంది.39 వేల క్యూసెక్కులను కిందకు వదులుతున్నారు.సాగర్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా.

ప్రస్తుతం 245 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

కులం పేరుతో దూషించిన ముగ్గురికి ఆరు నెలలు జైలు శిక్ష
Advertisement

Latest Nalgonda News