ఫ్రీగా ప్రచారం ఎదురు డబ్బులు ? కక్కలేక మింగలేక వారి పరిస్థితి ?

ఎక్కడైనా ఎన్నికలు జరుగుతున్నాయి అంటే, ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా పార్టీలోని సీనియర్ నాయకులు రంగంలోకి దిగి ప్రచారం చేస్తారు.అభ్యర్థి ఎన్నికల ప్రచారంతో పాటు, సీనియర్ నాయకులు ప్రచారానికి అయ్యే ఖర్చులన్నీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి భరిస్తూ రావడం, ఏ పార్టీలో అయినా సర్వసాధారణం.

 Congress Leaders Tention On Dubbaka Elections Telangana Congress, Dubbaka Elect-TeluguStop.com

ఒక్కోచోట ఆర్థికంగా బలహీనంగా ఉన్న అభ్యర్థి విషయంలో పార్టీ మొత్తం ఖర్చును భరిస్తుంది.అయితే తెలంగాణలోని దుబ్బాక నియోజకవర్గం లో ప్రతిష్టాత్మకంగా జరగబోతున్న అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఓ విచిత్ర పరిస్థితి ఏర్పడింది.

కాంగ్రెస్ తరపున అభ్యర్థిగా బరిలో ఉన్న చెరుకు శ్రీనివాసరెడ్డి కి మద్దతుగా కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులంతా రంగంలోకి దిగారు.ఇక్కడ కాంగ్రెస్ కు గెలుపు ప్రతిష్టాత్మకం కావడం, కాంగ్రెస్ భవిష్యత్తు ను ఈ ఎన్నికలే నిర్ధారించడం వంటి ఎన్నో అంశాలు ముడిపడి ఉండటంతో , ఇక్కడ గెలుపు కోసం గట్టిగానే ప్రచారం చేస్తున్నారు.

అయితే ఇక్కడ ప్రచారానికి దిగిన పార్టీ సీనియర్ నాయకులకు పెద్ద తలనొప్పి వ్యవహారం ఒకటి చుట్టుకుంది.పార్టీ ఆదేశాల మేరకు అభ్యర్థి ఎన్నికల ప్రచారానికి దిగిన సీనియర్ నాయకులకు, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ ఠాగూర్ కొత్త నిబంధనలు విధించారు.

చెరుకు శ్రీనివాస్ రెడ్డి కి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేయడంతో పాటు, ఆర్థికంగానూ ఆయనను ఆదుకుంటూ, ఎన్నికల ఖర్చును భరించాలి అంటూ ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పుడు సీనియర్ నాయకులంతా లబోదిబోమంటున్నారు.కాంగ్రెస్ అధికారానికి దూరమై చాలా కాలమైంది.

పార్టీ కార్యక్రమాల నిర్వహణ నిమిత్తం భారీగా సొమ్ము లు ఖర్చు పెడుతున్నామని, ఈ కష్టకాలంలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి ఖర్చును సైతం తమ ఖాతాల్లో వేయడం సరికాదని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఏదో రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్థికభారం అయినా తాము నెట్టుకొస్తున్నాము అని, ఇలా ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చును సైతం తమ ఖాతాల్లో వేస్తే ఎలా అని వారు వాపోతున్నారట.

మరోవైపు అధికార పార్టీ టిఆర్ఎస్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతిపక్షాలు కోలుకోలేని విధంగా దెబ్బ తీసేందుకు భారీగా సొమ్ము ఖర్చు పెడుతూ, ప్రతిపక్షాలకు ఊహించని దెబ్బ కొట్టాలని ప్రయత్నిస్తోంది.ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి కి ఆదరణ బాగానే ఉన్నా ఇప్పుడు ఆర్థికభారం సీనియర్ నాయకుల మీద పడడంతో, వారు కక్కలేక మింగలేక తమ ఆవేదనను ఒకరితో ఒకరు పంచుకున్నారట.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube