కొత్త ఐఫోన్ కొనుగోలు చేయడం పేద, మొదటి తరగతి వారికి దాదాపు అసాధ్యమని చెప్పవచ్చు.ఎందుకంటే దాని ధర చాలా ఎక్కువగా ఉంటుంది.
ఒకవేళ దీన్ని కొనుగోలు చేయాలన్న చాలా ఏళ్ల పాటు మనీ సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది.అంత ఓపిక లేనివారు బడ్జెట్ రేంజ్‌లో వచ్చే ఫోన్లను కొనుగోలు చేసి వాటితోనే తమ పనులను కానిచేస్తుంటారు.
అయితే ఐఫోన్ కొనుగోలు చేయాలని ఆశ చాలా మందిలో ఉంటుంది.అలాంటి వారి కోసం తాజాగా ఐఫోన్‌కి పోటీగా ఒక చైనీస్ కంపెనీ బడ్జెట్ ఫోన్ తీసుకొచ్చింది.
ఇది చూసేందుకు అచ్చం ఐఫోన్ లాగానే కనిపిస్తుంది.దీని కొనుగోలు చేయడం ద్వారా ఐఫోన్ కొన్నంత హ్యాపీనెస్ కూడా పొందొచ్చు.పైగా దీని ధర కేవలం రూ.10,900 రూపాయలు మాత్రమే! ఇంతకీ ఏంటా ఫోన్…
చైనీస్ మొబైల్ తయారీదారు LeEco రీసెంట్‌గా LeEco S1 ప్రో ఫోన్‌ను చైనీస్ మార్కెట్లోకి విడుదల చేసింది.దీనిని చూస్తే ఎవరైనా సరే అది కచ్చితంగా ఐఫోన్ 14 ప్రో అనే అనుకుంటారు.ఎందుకంటే ఆ ఫోన్ అచ్చుగుద్దినట్లు ఐఫోన్ 14 ప్రో ఫోన్ లాగానే ఉంది.
ధర తక్కువే అయినా ఇందులో 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఇవ్వడం విశేషం.ఎంత పిండికి అంత రొట్టె అన్నట్లు ఐఫోన్ 14 లో లాగా ఇందులో ప్రాసెసర్, జీపీయూ , కెమెరాలు బ్యాటరీ కెపాసిటీ అంతా ఎక్కువగా ఏమీ ఉండదు.LeEco S1 Pro ఫోన్‌లో 6.5-అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంటే ఐఫోన్ 14 ప్రోలో 6.1-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంటుంది.
ఓఎల్ఈడీ డిస్‌ప్లే చాలా కాస్ట్ అవుతుంది.ఇందులో బొమ్మలు ఎక్స్‌లెంట్‌గా కనిపిస్తాయి.ఐఫోన్‌లో హై-ఎండ్ 4K కంటెంట్‌ను కూడా వీక్షిస్తూ బ్రహ్మాండమైన అనుభూతిని ఆస్వాదించవచ్చు.
ఇక LeEco S1 ప్రో ఎల్‌సీడీ డిస్‌ప్లే కేవలం HD+ రిజల్యూషన్‌లో మాత్రమే కంటెంట్ చూపించగలదు.ఇకపోతే LeEco S1 Pro 60Hz రిఫ్రెష్ రేట్, ట్రిపుల్ రియర్ బ్యాక్ కెమెరా సెటప్‌తో వస్తుంది.ఇది 13-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.10W ఛార్జింగ్ సపోర్ట్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ దీనిలో అందించారు.ఇలా చూసుకుంటే పర్ఫామెన్స్ పరంగా ఇది మామూలు ఫోనే కానీ డిజైన్ విషయంలో మాత్రం ఐఫోన్ 14 ప్రోకి గట్టి పోటీ ఇస్తుంది.అందరి ముందు షో చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.