ఆదర్శవంతమైన కలెక్టర్! కాన్వాయ్‌కి దారివ్వబోయి బోల్తా పడిన ఆటోని పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు?

ఎవరు ఎలాంటి తప్పులు చేసినా ఇపుడు ఓ మూడోకన్ను ఓ కంట కనిపెడుతూ ఉంటోంది.అదే సోషల్ మీడియా.

 Collector Didnot Stops Convoy After Seeing A Auro Rickshw Fell Down Video Viral-TeluguStop.com

అవును, సోషల్ మీడియానుండి ఎవరూ తప్పించుకోలేరు.వాళ్ళు ఎంతటివారులైనా సరే తప్పించుకోలేరు.

ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా అనేక చోట్ల రోడ్లు గంటలు పడ్డాయి.ఇక రోడ్ల అభివృద్ధి గురించి అందరికీ తెలిసినదే.

దీంతో వాహ‌నాల రాక‌పోక‌ల‌కు తీవ్ర అంత‌రాయం క‌లుగుతోంది.ఇక ఈ నేపథ్యంలో అలాంటి ఓ రోడ్డుపై ఓ ఆటో బోల్తా పడింది.

అదే ఆటో ముందు నుండి కలెక్టర్ కాన్వాయ్ నిమ్మకు నీరెత్తినట్టు వెళ్లిపోవడం కొసమెరుపు.

వివరాల్లోకి వెళితే, మరమ్మత్తులు చేయని ఓ రోడ్డుపై ఓ ఆటోవాలా ప్రయాణిస్తున్నాడు.

అతడికి ఎదురుగా కలెక్టర్ కాన్వాయ్ రావడంతో అతగాడు తన ఆటోని మరింత పక్కకు జరిపాడు ఈ క్రమంలో పక్కనే వున్న గుంతలోకి ఆ ఆటో బోల్తా పడిపోయింది.అయినా ఆ కాన్వాయ్ ఆపకుండా అలాగే వెళ్లిపోయారు.

కనీసం కన్నెత్తి కూడా చూడలేదు.సీతాపుర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా వైరల్ అవుతోంది.

మెజిస్ట్రేట్‌ కాన్వాయ్ కి ఆటో సైడ్ ఇవ్వబోయి, అదుపుతప్పి బోల్తా పడింది పాపం.అందులోని ప్రయాణికులందరు బురద నీటిలో పడిపోయారు.

అయితే ఈ తంతునంతా చూస్తున్న జనాలు అక్కడ ఎవరికైనా ఏమైనా జరిగిందా అనుకొని పరుగెత్తుకు వెళ్లారు.కొందరు ఆ దృశ్యాన్ని తమ కెమెరాలలో బంధించారు.ఆ మొత్తం ఘటనను సోషల్ మీడియాలో షేర్ చేశారు.దీంతో వీడియో వైరల్ అవుతోంది.అందువలన నెటిజన్లు కాన్వాయ్ ఆపకుండా వెళ్లిపోయిన కలెక్టర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.“సామాన్యులు నడిరోడ్డుపై కిందపడినా పట్టించుకోని అధికారులు, ఇక ప్రభుత్వ కార్యాలయాలకు పని కోసం వెళ్తే వాళ్లను కనీసం కన్నెత్తైనా చూస్తారో లేదో అని కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube