మనుషులు సాంకేతికతను ఎంత అభివృద్ధి చేసినా, కొన్ని సార్లు పక్షుల తెలివి చూసి ఆశ్చర్యపోవాల్సిందే.అవి బ్రతికే విధానం ఆసక్తికరంగా ఉంటుంది.
పిల్లలకు ఆహార సేకరణ, గూడు కట్టుకోవడం వంటివి ఎంతో ప్రణాళికబద్ధంగా నిర్వహిస్తాయి.ముఖ్యంగా గూళ్లను ఎంతో చక్కగా తయారు చేసుకుంటాయి.
వాటిని చూసినప్పుడు ముచ్చటేస్తుంది.బయటకు దృఢంగా కనిపించే వాటి గూళ్లు, లోపల మెత్తగా ఉండేలా ఏర్పాట్లు ఉంటాయి.
ఇదే కోవలో ఓ కాకి తన పిల్లల కోసం గూళ్లను కట్టాలని తలంచింది.అందుకు అవసరమైన వస్తువులను సేకరించే క్రమంలో దాని తెలివి చూసి నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు.
వర్షాకాలం రాకముందే పక్షులు జాగ్రత్త పడతాయి.అవి తలదాచుకునేందుకు వేసవిలోనే చక్కటి గూళ్లను నిర్మించుకుంటాయి.చూడచక్కని డిజైన్ మాత్రమే కాదు.లోపల సౌకర్యంగా ఉండేలా చూసుకుంటాయి.
తాజాగా ఓ కాకి తన గూడు కోసం చిన్నచిన్న పుల్లలు ఏరుకుంది.గూడు కట్టుకుంది.
కానీ లోపల మెత్తగా ఉండేందుకు ఓ జింకను టార్గెట్ చేసుకుంది.దాని తోకలోని తెల్లని వెంట్రుకలను నోటితో కరిచిపట్టుకుంది.
వాటిని సేకరించి గూడును మరింత అందంగా తీర్చుదిద్దుకుంది.ఇలా జింక తోక నుంచి తెల్లటి వెంట్రుకలను సేకరించే క్రమంలో ఓ వ్యక్తి దానిని వీడియో తీశాడు.
దానిని ఇన్స్టాగ్రామ్లో ‘నేచర్’ పేజీలో పోస్ట్ చేశారు.దానికి ఓ చక్కటి క్యాప్షన్ కూడా జోడించారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఆ కాకి తెలివి చూసి నెటిజన్లు ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు.