చెర్కుపల్లి-మాడ్గులపల్లిసింగిల్ రోడ్డుతో నిత్యం నరకమే...!

నల్లగొండ జిల్లా:కేతేపల్లి మండలం చెర్కుపల్లి నుండి మాడ్గులపల్లి మండల కేంద్రం వరకు గల సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా నిర్మించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

చెర్కుపల్లి గ్రామం నుండి ఎల్లమ్మగూడెం, చిరుమర్తి,ఆగామోత్కూర్, గుర్రప్పగూడెం,ఇందుగు గ్రామాల మీదుగా మాడ్గులపల్లి మండల కేంద్రానికి వచ్చే రహదారి 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది.

మాడ్గులపల్లి - చెర్కుపల్లి గ్రామాల మధ్య సింగిల్ రోడ్డును డబుల్ రోడ్ నిర్మాణ పనులు చేపడితే మిర్యాలగూడ,నల్లగొండ, సూర్యాపేట,నకిరేకల్ నియోజకవర్గాల్లోని చాలా గ్రామాలకు రవాణా సౌక్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు.ఈ రోడ్డు నిర్మాణం చేపడితే నార్కెట్ పల్లి-అద్దంకి,హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారుల మధ్య రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అంటున్నారు.

సింగిల్ రోడ్డుగా ఉండడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కిందికి దిగలేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, డబుల్ రోడ్డు నిర్మాణం చేయాలని ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎన్నోసార్లు వినతిపత్రం ఇచ్చినా పట్టించుకోలేదని,ఎన్నికల వచ్చిన ప్రతిసారీ నాయకులు రావడం ఎన్నికల్లో గెలిపిస్తే డబుల్ రోడ్డు నిర్మాణం చేపడతామని హామీ ఇవ్వడం గెలిశాక మొఖం చాటేయడం పరిపాటిగా మారిందని వాపోతున్నారు.ఇప్పటికైనా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం చొరవ తీసుకుని చెర్కుపల్లి - మాడ్గులపల్లి మధ్య సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చాలని కోరుతున్నారు.

దేవరకొండ యువతి గిన్నిస్‌ బుక్‌ రికార్డు
Advertisement

Latest Nalgonda News