తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర జరిగింది.ఈ సందర్భంగా మంత్రి కారుమూరి నాగేశ్వర రావు మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబుపై ధ్వజమెత్తారు.
మూడుసార్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదని మంత్రి కారుమూరి విమర్శించారు.జగన్ నాలుగేళ్లలోనే నలుగురు బీసీలకు మంత్రి పదవి ఇచ్చారని తెలిపారు.
చంద్రబాబు కౌంటర్ పెట్టి మంత్రి పదవులు అమ్ముకున్నారని ఆరోపించిన మంత్రి కారుమూరి జగన్ ను చూసి చంద్రబాబు సిగ్గుపడాలని మండిపడ్డారు.