రైతుబంధు పంపిణీకి అనుమతి ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం..!!

నవంబర్ 28వ తారీకు ఎన్నికల ప్రచారానికి చివరి తేదీ కావటంతో తెలంగాణలో ప్రధాన పార్టీలు జోరుగా ప్రచారంలో దూసుకుపోతున్నాయి.పోలింగ్ కి ఇంకా ఆరు రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఎవరికి వారు ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.

ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు భారీ ఎత్తున బహిరంగ సభలు.రోడ్ షోలు నిర్వహిస్తున్నాయి.

కాగా ఎన్నికలకు ఇంకా వారం రోజులు కూడా టైం లేని ఇలాంటి పరిస్థితులలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.

రైతుబంధు పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది.ఈనెల 28వ తారీకు సాయంత్రం లోపు మాత్రమే రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయాలని స్పష్టం చేయడం జరిగింది.

దీంతో ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వం 70 లక్షల మంది రైతులకు రైతుబంధు పంపిణీ నగదు జమ చేసేందుకు సిద్ధమయ్యింది.పోలింగ్ కి మరో ఐదు రోజులు ఉండగా కేంద్ర ఎన్నికల సంఘం రైతుబంధు విషయంలో తీసుకున్న నిర్ణయం అధికార పార్టీ బీఆర్ఎస్ కి అనుకూలంగా మారనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వాస్తవానికి రెండో విడత నిధులు నవంబర్ లోనే రైతులకు అందించాల్సి ఉంది.అయితే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో నిధుల విడుదల ఆగిపోయింది.ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలకు ఎలక్షన్ కమిషన్ ఆమోదం తెలపటంతో రైతుబంధు నిధుల విడుదలకు అడ్డంకులు తొలిగాయి.దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల ఖాతాలోకి.

రైతుబంధు నగదు జమ చేయడానికి సిద్ధమయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube