సెల్‌ఫోన్లు తీసుకెళ్తే సస్పెన్షనే...!

నల్లగొండ జిల్లా: పదో తరగతి పరీక్షల నేపథ్యంలో సెల్‌ఫోన్ల వినియోగంపై అధికారులు కఠిన ఆంక్షలు విధించారు.

ఈ నెల 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు పరీక్షలు జరుగనున్న నేపథ్యంలో పరీక్షా కేంద్రాలను నో సెల్‌ఫోన్‌ జోన్లుగా ప్రకటించారు.

పరీక్ష సిబ్బంది,స్కాడ్‌ సహా ఇతర అధికారులందరికీ ఈ నిబంధనలు వర్తిస్తాయి.ఇక తనిఖీలకు వచ్చే అధికారులు, కలెక్టర్లు,పోలీస్‌,విద్యాశాఖ ఉన్నతాధికారులు కూడా సెంటర్లల్లోకి సెల్‌ఫోన్లు తీసుకెళ్లడాన్ని అనుమతించరు.

Cell Phones Are Suspended In Tenth Exams, Cell Phones Suspended ,tenth Exams, No

వీరు తమ సెల్‌ఫోన్లను ఆరుబయటే పెట్టాల్సి ఉంటుంది.పోలీసులు తనిఖీలు చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తారు.

ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘించి సెల్‌ఫోన్లతో విధులకు హాజరైతే వారిని సస్పెండ్‌ చేస్తారు.పేపర్‌ లీకేజీలకు పాల్పడితే ఉద్యోగం నుంచి తొలగిస్తారు.

Advertisement

నిరుడు పదో తరగతి ప్రశ్నపత్రాలు వాట్సాప్‌లలో ప్రత్యక్షం కావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో ఎస్సెస్సీ బోర్డు ఈ నిర్ణయం తీసుకొన్నది.ఈ ఏడాది పదోతరగతి వార్షిక పరీక్షలకు 5.08 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.పరీక్షల నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాలను ఏర్పా టు చేశారు.

పరీక్షల నిర్వహణ దృష్ట్యా రాష్ట్రస్థాయిలో కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేశారు.విద్యార్థులు ఏమైనా సమస్యలుంటే -23230942 నంబర్‌ను సంప్రదించవచ్చు.

ఈ పరీక్షల నిర్వహణ దృష్ట్యా ఇప్పటికే 12 మంది ఉన్నతాధికారులను జిల్లా స్థాయి అబ్జర్వర్లుగా నియమించారు.విద్యార్థుల హాల్‌ టికెట్లను ఇప్పటికే స్కూళ్లకు పంపించగా, విద్యార్థులు నేరుగా వెబ్‌ సైట్‌ నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్‌ చేసుకునే అవకాశాన్నిచ్చారు.

విద్యార్థులు హాల్‌టికెట్‌ చూపిస్తే ఆర్టీసీ బస్సుల్లో పరీక్షా కేంద్రాల సమీప స్టేషన్‌ వరకు ఉచితంగా ప్రయాణించవచ్చు.ఇప్పటికే ఎస్సెస్సీ బోర్డు నామినల్‌రోల్స్‌,ఫొటో అటెండెన్స్‌ షీట్లు జిల్లాలకు చేర్చగా,తాజాగా ఓఎమ్మార్‌,ప్రశ్నపత్రాలు, సమాధానాల రాసే పేపర్లు, బుక్‌ లెట్‌లను జిల్లాలకు పంపిస్తున్నది.

సర్టిఫికెట్లు ఎన్నిసార్లైనా మీ సేవలో తీసుకోవచ్చు...!
Advertisement

Latest Nalgonda News