నల్లగొండ జిల్లా:తెలుగు రాష్ట్రాలలో రోగనిర్ధారణ పరీక్షల దోపిడిని అడ్డుకోలేరా అంటూ ఇద్దరు ముఖ్యమంత్రులకు ప్రజానేస్తం బోరాన్నగారీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రశ్నలను సంధిస్తూ బహిరంగ లేఖ రాశారు.
ల్యాబ్ల,స్కానింగ్ సెంటర్ల దగాకోరు దోపిడీనీ అంతం చేసే కఠిన చట్టాలు తీసుకురావాలి.
తెలుగు రాష్ట్రాలలో గల్లీగల్లీలో పుట్టగొడుగులా వెలసిన ప్రైవేట్ ల్యాబ్లు,స్కానింగ్ సెంటర్లు,ఆస్పత్రులు ఉన్నదే దోచుకునేందుకు అన్న చందంగా రోజురోజుకు అందినకాడికి దండుకుంటున్నారని సిపిఐ (ఎంఎల్) కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ జై బోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆవేదన వ్యక్తం చేశారు.కొంచెం ఆరోగ్యం బాగోలేక ఆస్పత్రులకు వెళ్తేచాలు జేబుకు చిల్లుపడుతోందని,అధిక ఫీజులు వసూలు చేస్తూ ప్రైవేట్ టెస్టింగ్ ల్యాబ్లు,స్కానింగ్ సెంటర్లు రెచ్చిపోతున్నాయని,కొన్నిచోట్ల వైద్యుల సూచనలు లేకుండానే స్కానింగ్లు,టెస్టులు చేసేస్తున్నారని ఆరోపించారు.
తెలుగు రాష్ట్రాలలో గల వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహించే స్కానింగ్ సెంటర్లలో అమాయక ప్రజలను నిట్టనిలువునా ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తూ ప్రజల దగ్గర నుండి వేలాది రూపాయలు అక్రమంగా,బహిరంగంగా వసూలు చేస్తున్నారని,ఈ దోపిడీని నియంత్రించడానికి చర్యలు తీసుకోవాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.తెలుగు రాష్ట్రాలలో చాలాచోట్ల అనుమతులులేకుండా స్కానింగ్ సెంటర్ల విచ్చలవిడిగా ఏర్పాటు చేస్తున్నారని, అధిక ఫీజుల వసూళ్లు కొనసాగుతున్నాయని,యధేచ్ఛగా కొనసాగుతున్న ఆరోగ్య పరీక్షల దందాపై ఇకనైనా కఠిన నిఘా పెంచాలని డిమాండ్ చేశారు.
వైద్యారోగ్యశాఖ అధికారుల పర్యవేక్షణ లోపంతో స్కానింగ్ సెంటర్లకు అడ్డూ,అదుపు లేకుండా పోతుందని,స్కానింగ్ సెంటర్లు,నర్సింగ్ హోమ్స్ నిబంధనలను లెక్క చేయడం లేదని,అధికారులకు వీలున్నప్పుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఆయా సెంటర్ల మీద కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కొంతమంది ప్రభుత్వ సిబ్బంది స్కానింగ్ సెంటర్ల నిర్వాహకుల నుంచి ముడుపులు తీసుకొని వీటివైపు కన్నెత్తి చూడటం లేదని ఆరోపించారు.
స్కానింగ్,డయాగ్నోస్టిక్ సెంటర్లకు రెన్యువల్ ఉండదా?అని ప్రశ్నించారు.స్కానింగ్ సెంటర్లు,ల్యాబ్ లో ధరల పట్టికలను ప్రదర్శించకుండా రిఫరల్ డాక్టర్లకు కమిషన్లు ఇచ్చి అందినంత దోచేస్తున్నారని,ఆర్థికంగా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కొంతమంది స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు సిండికేట్ గా మారి ధరలను పెంచి దండుకుంటున్నారని దగా పడుతున్న బాధితుల బంధువు,పీడిత ప్రజానేస్తం సుభాషన్న జైబోరన్నగారి నేతాజీ 8328277285 ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ నియమ,నిబంధనల మేరకు ప్రజలకు సేవలందించాల్సిన ప్రైవేట్ ల్యాబ్లు,స్కానింగ్ సెంటర్లు,ఆస్పత్రులు అందినంత దోచుకుంటున్నాయని, ప్రజాబంధువు సుభాషన్న పేర్కొన్నారు.ప్రభుత్వం ఎన్ని నిబంధనలు విధించినా సరే వారి దోపిడీ మాత్రం ఏమాత్రం ఆగడం లేదని తెలిపారు.
ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకొని ఈ దోపిడీ దందా భారీగానే సాగుతోందని, అవసరాన్ని బట్టి ధరలను పెంచేసి ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారని, ప్రజానేస్తం బోరన్నగారి నేతాజీ సుభాషన్న పేర్కొన్నారు.నగరాలలో,పట్టణాలలో, మండల కేంద్రాల్లో వీరి అవినీతికి అడ్డుఅదుపు లేకుండాపోతుందని, జ్వరాల సీజన్ ఉన్నప్పుడు ప్రజలను ముఖ్యంగా డెంగ్యూ,టైఫాయిడ్, మలేరియా వివిధరకాల అనారోగ్యాలకు గురికావడంతో పేరుపొందిన జనరల్ మెడిసిన్,ఎండి డాక్టర్ ను ఆశ్రయించడంతో ప్రతి వైద్యుడు ఆ రోగిని పరీక్షించి అన్నిరకాల పరీక్షలు చేయించాలని వైద్యులకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రైవేట్ ల్యాబ్క్ పంపి తనలాంటి పేదోళ్లనడ్డి విరుస్తున్నారని ప్రజానేస్తం జై జై బోరన్న గారి నేతాజీ సుభాషన్న పేర్కొన్నారు.
ఇదే అదనుగా భావించి నిబంధనలకు విరుద్ధంగా ప్రజల దగ్గర నుండి అధికంగా డబ్బులు వసూలు చేస్తూ అటు ప్రైవేట్ వైద్యులకు ల్యాబ్ల నుండి కమిషన్ డాక్టర్స్ పొందుతున్నారన్నారు.పరీక్షలలో ఎలాంటి వ్యాధి లక్షణాలు లేకున్నా కనీసం రూ.500 నుండి రూ.2000 వరకు మందులు రాస్తూ మెడికల్ షాపులకూ ఆదాయాన్ని పెంచి,మెడికల్ షాప్ నుండి కూడా కమిషన్ పొందుతున్నారన్నారు.కొన్ని ల్యాబ్స్ లో వివిధ పరీక్షలు నిర్వహిస్తే రక్తకణాల సంఖ్య తక్కువగా ఉన్నట్లు,మరికొన్ని పెద్ద పెద్ద కార్పొరేట్ ఆస్పత్రులలో పరీక్షలు చేపిస్తే రక్త కణాలు అధికంగా ఉన్నట్లు ల్యాబ్ రిపోర్టులు వస్తున్నాయని, ల్యాబ్స్ నూ,స్కానింగ్ సెంటర్స్ నూ సమగ్రంగా పరిశీలించి శాస్త్రీయతను నిర్ధారించే వైద్యులు,టెక్నిషియన్లు, ప్రామాణికంగా నిర్ధారణ చేయకుండానే కొన్ని సెంటర్లలో తప్పుడు రిపోర్టులు కూడ ఇస్తూన్నారని ఆరోపించారు.
రోగుల దగ్గర నుండి ముక్కుపిండి వేలకు వేలు ఫీజులు విచ్చలవిడిగా వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వ నియమ,నిబంధనలను ఆదేశాలను తుంగలోతొక్కి వైద్యులు రోగుల్లో భయాన్ని కలిగిస్తూ,అక్రమంగా అందినకాడికి దోచుకుంటూ ఉన్నారని తెలిపారు.
అవసరం లేకుండా వైద్యులు స్కానింగ్,ఎక్సరే తప్పనిసరి అని రోగులనుకోరుతూ బలవంతంగా స్కానింగ్,ఎక్సరే చేయిస్తున్నారని తెలిపారు.వాతావరణ మార్పుల మూలంగా రోజు,రోజుకు చిన్నపిల్లలకు విపరీతంగా జ్వరాలు,దగ్గు,జలుబు వివిధ రకాల అనారోగ్యాలకు గురి అవుతున్నారని పేర్కొన్నారు.
అయితే వారు తప్పని పరిస్థితుల్లో పిల్లల డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు స్కానింగ్,ఎక్సరే రాస్తూ అక్రమంగా అధికంగా, బలవంతంగా తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తూ బిల్డింగ్ మీద బిల్డింగులు నిర్మించుకుంటున్నారని ఆరోపించారు.కొందరు వైద్యులు స్కానింగ్ ల్యాబ్ నిర్వాహకులు వైద్యాన్ని ప్రజలను నిలువునా దోచుకునే దోపిడి వ్యాపారంగా మార్చేస్తున్నారని ప్రజాబంధు ఆవేదన వ్యక్తం చేశారు.
స్వల్పంగా దగ్గు,జలుబు, జ్వరం ఉంటే చాలు అవసరం లేకున్నా వాటిని ఆసరా చేసుకుంటున్నారని, ఫలితంగా తనలాంటి పేద,సామాన్య ప్రజల జేబుకు చిల్లుపడుతుందనీ పేద వర్గాల నేతాజీ సుభాషన్న బాధను వ్యక్తం చేశారు.తెలుగు రాష్ట్రలలోని చిన్నచితక మొదలుకొని,ప్రముఖ స్కానింగ్ సెంటర్ల వరకు,ల్యాబ్ లలో నిర్వాహకులు అడ్డగోలుగా బిల్లులను తీసుకుంటూ ఆర్థికంగా,దోపిడీకి తెగబడుతున్నారని సుభాషన్న 9848540078 తెలిపారు.
మార్గాలకు అడ్డుపడేది ఎప్పుడైనా ప్రజా నేస్తం జైబోరాన్నగారి నేతాజీ సుభాషన్న పాలకులను ప్రశ్నించారు.కనీసం రిసిప్టులూ కూడా ఇవ్వకుండా ముక్కుపిండి అడ్డగోలుగా మరీ బిల్లులు వసూలు చేస్తున్నారని బోసన్న తెలిపారు.
కోట్లాది రూపాయలు అక్రమంగాసంపాదిస్తూ ప్రజల సంపదలను అన్యాయంగా దోచుకుంటున్నారని తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి సిపిఐ ఎంఎల్ కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ పౌర, ప్రజాస్వామిక హక్కుల ప్రజాతంత్ర ఉద్యమకారుడు,ప్రజానేస్తం కామ్రేడ్ జై బోరన్నగారి నేతాజీ సుభాషన్న రాసిన బహిరంగ లేఖలో బాధితుల తరఫున తీవ్రమైన బాధను వ్యక్తం చేశారు.ప్రజలను,ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న స్కానింగ్ సెంటర్లపై జిల్లాస్థాయి, రాష్ట్ర స్థాయిఅధికారుల పర్యవేక్షణ తూ తూ మంత్రంగానే జరుగుతుందని తెలుగురాష్ట్రాల్లో అన్ని జిల్లాలలో, పట్టణకేంద్రాలలో స్కానింగ్ సెంటర్లో, ప్రైవేట్ ల్యాబ్ లలో జరుగుతున్న ఈ అక్రమమైన మోసాన్ని సంబంధిత అధికారులు దాడులు పకడ్బందీగా నిర్వహించి ఇకనైనా ఈ దోపిడి వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలని ప్రజా నేస్తం జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను డిమాండ్ చేశారు.
తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి అన్ని ల్యాబ్లో స్కానింగ్ సెంటర్ల నిర్వాహకుల ఆస్తుల వివరాలను ఎప్పటికప్పుడు లెక్కల వివరాలు తీయాలని,అక్రమ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని,టెక్నీషియన్ల విద్యఅర్హత ధ్రువపత్రాలను సక్రమంగా పరిశీలించాలని,సరైన విద్యార్హత లేని వారిని వెంటనే తొలగించాలని,అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నఅధికారుల అక్రమ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని అవినీతి అధికారులను కఠినంగా శిక్షించాలని ప్రజా నేస్తం జై బోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్ర బోస్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు.
Latest Nalgonda News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy