ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీలు( Electric car companies ) పోటీపడి మరి అడ్వాన్స్ ఫీచర్లతో కూడిన కారులను ఎప్పటికప్పుడు మార్కెట్లో విడుదల చేస్తూనే ఉన్నారు.ఈ క్రమంలో బీవైడీ కంపెనీ( BYD COMPANY ) ఇటీవలే సరికొత్త ఎలక్ట్రిక్ కారును చైనా మార్కెట్లో ఆవిష్కరించింది.
ఈ కారుకు సంబంధించిన అడ్వాన్సుడ్ ఫీచర్, ధర వివరాలు ఏమిటో చూద్దాం.బీవైడీ కంపెనీ బీవైడీ టంగ్ ఈవీ 2023 వెర్షన్ మోడల్ ను మార్కెట్ లోకి తీసుకువచ్చింది.
ఈ కారు మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది.అందులో 600 కిలోమీటర్ల వెర్షన్ కారు ధర రూ.34300 డాలర్లు, 730 కిలోమీటర్ల వెర్షన్ కారు ధర రూ.37700, 635 కిలోమీటర్ల 4 వీల్ డ్రైవ్ వెర్షన్ కారు ధర రూ.41100 గా ఉంది.
గత ఏడాది మోడల్లతో పోలిస్తే.2023 మోడల్ల కార్ల ధరలు దాదాపు 13.7 శాతం వరకు తగ్గాయి.అంతేకాకుండా గత మోడల్లతో పోలిస్తే ఈ ఏడాది సరికొత్త ఫీచర్లతో కార్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది.ఈ సరికొత్త కారులలో 20 ఇంచ్ వీల్స్, డిసుస్ సీ ఇంటెలిజెంట్ డ్యాంపింగ్ బాడీ కంట్రోల్ సిస్టం లాంటివి ఉన్నాయి.
అంతేకాకుండా 2023 మోడల్స్ అన్నింటిలో 5జీ నెట్వర్క్ సపోర్ట్ కూడా ఉంది.ఈ కారులలో సిక్స్ సీటర్, సెవెన్ సీటర్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.600 కిలోమీటర్ల రేంజ్ కలిగిన కారులో 168 kwh మోటార్ అమర్చారు.730 కిలోమీటర్ల రేంజ్ కారులో 180kwh మోటార్ అమర్చారు.630 కిలోమీటర్ల 4 వీల్ డ్రైవ్ కారులో 380 kwh మోటర్ అమర్చారు.ఈ 630 కిలోమీటర్ల 4 వీల్ డ్రైవ్ కారు 4.4 సెకండ్ల కాలంలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.ఈ కారులో ప్రత్యేకంగా సెల్ఫ్ ప్రొడ్యూస్డ్ బ్లేడ్ ఎల్ఎఫ్పీ బ్యాటరీస్ ఉంటాయి.కేవలం 10 నిమిషాలు చార్జింగ్ పెట్టి 173 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.35 నిమిషాలలో బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవుతుంది.