క్షణికావేశంలో కన్నతల్లిని హతమార్చిన కసాయి కొడుకు..!

ప్రస్తుత సమాజంలో మనిషి తనను తాను కంట్రోల్ చేసుకోలేక క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాల వల్ల, చేస్తున్న పనుల వల్ల కుటుంబాలు రోడ్డున పడతాయి అనడానికి ఈ సంఘటన నిదర్శనం.ఓ యువకుడు తన తల్లితో గొడవపడి క్షణికావేశంలో తల్లిని అత్యంత దారుణంగా హత్య( Murder ) చేశాడు.

 Butcher's Son Who Killed His Mother In Law In A Moment's Rage , Thane , Mahara-TeluguStop.com

అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

Telugu Maharashtra, Postmortem-Latest News - Telugu

వివరాల్లోకెళితే.మహారాష్ట్ర థానే లోని ముర్బాద్ తాలూకా వేలు గ్రామంలో 55 ఏళ్ల మహిళ తన కుమారుడితో పాటు నివాసం ఉంటుంది.ఇంట్లో ఈ తల్లి కొడుకుల మధ్య ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉండేది.

ప్రతి చిన్న విషయాన్ని పెద్దది చేస్తూ గొడవ పడేవారు.ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం ఇంటికి వచ్చిన కుమారుడికి తల్లి భోజనం వడ్డించింది.

భోజనం రుచిగా లేదని తల్లితో వాగ్వాదానికి దిగాడు.ఈ వాగ్వాదం పెరిగి తీవ్ర స్థాయికి చేరింది.

సహనం కోల్పోయిన కుమారుడు క్షణికావేశంలో ఇంట్లో ఉండే కొడవలితో తల్లి మెడ కోసేసాడు.తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

Telugu Maharashtra, Postmortem-Latest News - Telugu

ఇది గమనించిన చుట్టుపక్కల ఉండే వారంతా వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు ( police )సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం( Postmortem ) నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.అయితే అంతలోపే ఆ యువకుడు నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు.సమీప బంధువు ఒకరు ఈ విషయాన్ని వెంటనే గమనించడంతో ఆలస్యం చేయకుండా ఆ యువకుడిని ఆసుపత్రికి తరలించారు.

ఆ యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.ఆ యువకుడు పూర్తిగా కోలుకున్నాక అదుపులోకి తీసుకొని కేసు విచారణ చేస్తామని పోలీసులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube