ఘనంగా బీ ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు

అసమానతలు లేని సమాజ నిర్మాణమే బాబా సాహెబ్ అంబేద్కర్ లక్ష్యమని,ఆ లక్ష్య సాధన కోసం అందరం ఐక్యంగా పోరాడుదామని కెవిపిఎస్ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జు( Paladugu Nagarjuna )న పిలుపునిచ్చారు.

బుధవారం కెవిపిఎస్, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా నల్లగొండలోని డీఈఓ ఆఫీస్ ముందుగల అంబేద్కర్( BR Ambedkar ) విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులం పునాదులపై జాతిని గాని నీతిని గాని నిర్మించలేమని కుల ఆధారిత సమాజాన్ని కూలదోసి అసమానతలు లేని సమాజాన్ని స్థాపించాలనే అంబేద్కర్ లక్ష్య సాధన కొరకు పోరాడదామన్నారు.కొందరు ప్రజా నాయకులు అంబేద్కర్ మాకు స్ఫూర్తి అని చెబుతూనే అంబేడ్కర్ రాజ్యాంగాన్ని కూలదోచే కుట్రలు పన్నుతున్నారన్నారు.

అసమానతలకు మూలమైన మనస్మృతి మనుధర్మ శాస్త్రాన్ని బాహటంగా బలపరచడం ఏమిటని ప్రశ్నించారు.మన రాజ్యాంగం( Constitution of India )అంటరాని తనాన్ని నిర్మూలించిందని అన్నారు.

స్వేచ్ఛ, సమానత్వం సామాజిక న్యాయం కొరకు పోరాడుదామన్నారు.ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి,చేతి వృత్తిదారుల సంఘం జిల్లా కన్వీనర్ గంజి మురళీధర్, గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కొండా వెంకన్న, కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి గాదే నరసింహ, బొల్లు రవీందర్ కుమార్, అంజిబాబు,వెంకన్న, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Nalgonda News