నల్లగొండ జిల్లా:చీడపురుగు చిన జీయర్ ను తెలుగు సమాజం నుండి సాంఘిక బహిష్కరణ చేద్దాం! సమ్మక్క,సారాలక్కల పోరాట స్ఫూర్తిని కొనసాగిద్దాం!! ప్రజా ఉద్యమాలనేత బోసన్న పిలుపు!!! కోట్లాది మంది ప్రజలు విశ్వసించే ఆదివాసి పోరాటయోధులైన సమ్మక్క,సారలక్కలను కించపరచి, దళిత,బహుజన,గిరిజన,శ్రామిక సంస్కృతి, సంప్రదాయాలను అవమానపనుస్తున్న చీడపురుగు, చీటర్ చినజీయర్ ను తెలుగు సమాజం నుండి తక్షణమే సాంఘిక బహిష్కరణ చేయాలని సమస్త తెలుగు ప్రజానీకానికి ప్రజాఉద్యమకారుడు,సిపిఐ (ఎం-ఎల్) కార్యదర్శి,శ్రామికవర్గ పోరాటాల నేతాజీ కామ్రేడ్ సుభాష్ చంద్రబోస్ పిలుపునిచ్చారు.ఈ మేరకు తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ తో పాటు సమస్త తెలుగు ప్రజానీకానికి బోరా నేడొక బహిరంగ లేఖ వ్రాస్తూ దళిత,గిరిజన ప్రజా సంస్కృతిని అడుగడుగునా అవమానపరుస్తున్న చీడపురుగు చినజీయర్ పై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమెదు చేయాలని సుభాశన్న డిమాండ్ చేశారు.
యాదగిరిగుట్టను యాదాద్రిగా మార్చినప్పుడు, దళితుల ఆహారాన్ని అవహేళన చేసినప్పుడు,శ్రామిక ప్రజల పనిపాటలను ఎగతాళి చేసినప్పుడే చినజీయర్ మొహమ్మీద ఉమ్మి,నాలుగు తన్ని,నాలుకను కాల్చివాత పెట్టకపోవడమే నేటి బరితెగింపుగా పేర్కొన్నారు.1956 నవంబర్ 3 వ తేదీన ఆకులమన్నాడ చిలకమర్రి వెంకటాచార్యులు, అలివేలు మంగతాయారు దంపతులకు జన్మించిన ఆకులమన్నాడ చిలకమర్రి శ్రీమన్నారాయణ చార్యులకు చిన్నప్పటినుండి చిల్లర బుద్ధులుతప్ప విద్యాబుద్ధులు, అందరినీ అభిమానించే అభ్యుదయభావాలు అబ్బలేదని బోసన్న తెలిపారు.తూర్పు గోదావరి జిల్లా మండపేట అర్తమూరు గ్రామంలో వైష్ణవ కుటుంబంలో పుట్టిన నారాయణాచార్యులకు చదువు,సంస్కారం అబ్బకపోవడంతో కొంతకాలం సినిమా బ్లాక్ టికెట్స్ అమ్మేవాడని,మండపేట సంతలో సైకిళ్ళకు పంచర్లు వేసేవాడని తెలిపారు.
చదువు అబ్బకపోవడం, జులాయిగా తిరగడం,పనిపాట లేకపోవడంతో సంపాదన లేక,పదవ తరగతి పదిసార్లు ఫెయిల్ కావడంతో కొడుకు భవిష్యత్ మీద బెంగ పెట్టుకున్న వెంకటాచార్యులు,అలివేలు మంగమ్మ 28 సంవత్సరాల వయస్సులో నల్లన్ చక్రవర్తి, రఘునాథాచార్య స్వాములకు గుమస్తాగా పనిలో పెట్టారని గుర్తు చేశారు.సన్యాసులైన గురువుల వద్ద గుమస్తాగా చేరిన కొంతకాలానికే గురువులకు పంగనామాలు పెట్టి,తనకు తానే గురువుగా ప్రకటించుకుని పర్యవసానంగా తన అసలు పేరు నారాయణాచార్యులని వదులుకొని చిన్న జీయర్ (చిన్న సింహం) స్వామిగా అవతారం మెత్తాడని బోరా సుభాష్ చంద్రబోస్ నేతాజీ పేర్కొన్నారు.
పదవ తరగతి ఫెయిల్ అయినోడికి నేడు దేశ,విదేశాల్లో వేలాది ఎకరాల భూములు,వేలకోట్ల ఆస్తులు,టన్నుల కొద్దీ బంగారం ఎక్కడ నుంచి వచ్చాయని బోరన్న ప్రశ్నించారు.చిన్న జీయర్ ధనవంతులకు రాజకీయ నాయకులకు,అవినీతి అధికారులకు,కార్పొరేటు దొరలకు,దేశాన్ని,రాష్ట్రాన్ని దోచుకునే చట్టబద్ధ దొంగలకు మాత్రమే దర్శనమిస్తాడని,ప్రజాసేవ పేరుతో ప్రజాధనాన్ని దోచుకునే దళారీలకు ప్రాధాన్యం ఇచ్చే స్వామికి శ్రామిక వృత్తుల ప్రజలంటే చులకనభావమని బోసు తెలిపారు.
అంటరానితనాన్ని విడనాడాలని, ప్రజలందరిని సమానంగా చూడాలని బోధించిన సమతమూర్తిగా పేర్కొంటున్న రామానుజాచార్య విగ్రహాన్ని వేలకోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంగరంగంగా ఆడంబరాలు జరిపిన కొద్దిరోజులకే తనలో ఉన్న మనువు మేల్కోకొన్నాడని,అసలు రూపం బయటపడిందని బోరన్న పేర్కొన్నారు.చిన్న జీయర్ ఒక వెధవ,బ్లాక్ టికెట్స్ అమ్మేవాడు, చదువు,సంస్కారం అబ్బనోడు,ఇతర కులాల,మతాల ప్రజలను గౌరవించలేని వాడికి సమతామూర్తి విగ్రహం పెట్టే అర్హత ఉందా? అని బోరా సుభాష్ ప్రశ్నించారు.రామానుజాచార్యుడిని దేవుడిగా భావిస్తవు కానీ, సమ్మక్క సారలక్కలను ఎందుకు దేవతలుగా భావించవు.
ఇది నీలో ఉన్న కుల అహంకారాన్ని చాటడం లేదా అని చిన్న జీయర్ను బోరన్న ప్రశ్నించారు.మీలాగా బంగారు విగ్రహాలు పెట్టి,బ్లాక్ మనీ దొంగలకు ఊడిగం చేస్తూ భక్తి ముసుగులో విందులు,వినోదాలు,సరదాలు వరదాలతో ఆనందంగా జీవితాన్ని గడిపేస్తూ,ఎలాంటి శారీరక,మానసిక శ్రమ లేకుండానే వేలాది కోట్ల ఆస్తులు కూడబెట్టిన చిన్న జీయర్ కు సమ్మక్క-సారలమ్మల పేర్లు ఉచ్చరించే నైతిక అర్హత లేదని సుభాశన్న మండిపడ్డారు.
గతంలో రామానుజాచార్య దళిత దీన జనోద్ధరణ చేస్తే నేడు ఆయన పేరుతో ఈ చిన్న జీయర్ ధనవంతులను, రాజకీయ నాయకులను ఉద్ధరించడానికి ఉపయోగపడుతున్నాడని,మేడారంలో సమ్మక్క దగ్గర భక్తులు తమ విశ్వాసాన్ని వెళ్లబుచ్చుతుంటే, ముచ్చింతల్లో రామానుజాచార్యుడి పేరుతో మైహోం రామేశ్వరరావు వేల కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని సుభాష్ తెలిపారు.అమ్మ కడుపు నుండి కాక ఆకాశంలో నుండి ఊడిపడ్డట్లుగా అహంకారాన్ని చూపెట్టే చిన్నజీయర్ దొంగకు ఊడిగం చేసే వాళ్ళందరూ పెద్ద వెధవలని బోరాజీ తెలిపారు.
నేను ఎవరిని ముట్టుకోనివ్వను అని బహిరంగంగానే ప్రకటించుకున్న చిన్న జీయర్ లాంటి పాపాత్ముడికి పాదసేవ చేస్తున్న ప్రజాప్రతినిధులకు,విద్యావేత్తలకు, భక్తులకు సిగ్గు,శరం లేదని బోరాజీ విమర్శించారు.బాహ్య పరిశుద్ధత కంటే అంతరంగ పరిశుద్ధత చాలా అవసరమని చిన్న జీయర్ లాంటి దొంగ సన్యాసులకు తెలియదని సుభాష్ చంద్రబోస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
చిన్న జీయర్ పేరుకే సన్యాసి కానీ,వీడు అనుభవించే భోగాలు నాడు మహా రాజులు,రాణులు కూడా అనుభవించబోరని బోరాన్న తెలిపారు.చిన్న జీయర్ ను ఆరాధించే అజ్ఞానులను చూస్తే సిగ్గేస్తుందని,రాజకీయ,వ్యాపార వర్గాలకే చిన్న జీయర్ కటాక్ష వీక్షణాలు లభిస్తాయని నేతాజీ తెలిపారు.
ఇంట్లో పిల్లలు పుట్టినా,పిల్లలకు పేర్లు పెట్టాల్సివచ్చినా,అన్నం పెట్టాలన్నా,పెండ్లి చేసుకోవాలన్నా,శోభనం చేసుకోవాలన్నా,చావు దినం జరపాలన్నా ప్రతిదానికి బ్రాహ్మణుడి దగ్గరకు పోయి, వాళ్లు చెప్పేదే దైవవాక్కుగా పాటించే అజ్ఞానులున్నంత వరకు మనదేశం సామాజిక,సాంస్కృతిక రంగాల్లో ఎప్పటికీ అభివృద్ధి కాదని బోస్ తెలిపారు.కుక్కలను, ఆవులను,పిల్లులను,జంతువులను ముద్దు పెట్టుకునే మత పెద్దలు,అగ్రకుల దురహంకారులు సాటి మనుషుల యందు కనీసం కరుణ,జాలి,దయ చూపకపోగా అంటరానితనాన్ని ప్రదర్శిస్తున్నారని, ఇండియాలో కుల వివక్షత,కుల దురహంకారం కొనసాగినంతకాలం ప్రపంచ దేశాలతో అభివృద్ధిలో పోటీ పడలేమని బోరా సుభాష్ అన్న స్పష్టం చేశారు.
జన్మనిచ్చిన తల్లిదండ్రులను,మార్గం చూపిన గురువులను,సహాయ సహకారాలు అందించిన శ్రేయోభిలాషులను మరిచిపోయి కృతజ్ఞత అంటే తెలియని అత్యధిక మంది వెధవలే చిన్న జీయర్ లాంటి బాబాలకు,స్వాములకు భక్తులుగా భజన చేస్తారని సుభాష్ పేర్కొన్నారు.తల్లిదండ్రులకు జీవితాంతం పాదసేవ చేసిన వారి రుణం తీరదని, కులగజ్జి పిచ్చి ఉన్న వారి చుట్టూ,పదవులున్న వారి చుట్టూ ప్రదక్షిణలు చేసే అమాయకులారా, అజ్ఞానులారా,ఆశాజీవులారా ఇకనైనా మేల్కోండని బోరా సుభాష్ పిలుపునిచ్చారు.
ధనమున్న వారికి దాసోహం కావద్దని బోరా చెప్పారు.మనిషికైనా దేవుడికైనా వారి విగ్రహాలు ఎక్కడ మూడు అడుగులకు మించి ఉండమని,కానీ,దానికి భిన్నంగా 300 అడుగుల విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారని ఇటువంటి చర్యలు గిన్నిస్ బుక్లో చోటు కోసం తప్ప ప్రజలకు ఉపయోగపడే చర్యలు కావని సుభాష్ తెలిపారు.
పట్టు బట్టలు వెండి,బంగారు విగ్రహాలు పంచ పాత్రలు,టన్నులకొద్దీ పాలు,నెయ్యి,పూలు ఆడంబరం,అట్టహాసం ప్రదర్శించుకోవడానికి ఖర్చు పెడుతున్నారని,స్విస్ బ్యాంక్ల నిండా భారత దేశ నాయకుల,వ్యాపారుల,స్వాముల,బాబాల ఆస్తులు, డబ్బులే ఉన్నాయని బోరన్న ఆరోపించారు.పూజారికి జ్ఞానం బట్టి అర్హత ఉండాలి కానీ,కులాన్ని బట్టి ఉండకూడదని,బ్రాహ్మణులు మాత్రమే వేల సంవత్సరాలుగా పురోహితులుగా కొనసాగడం పెద్ద కుట్రగా బోరాసుభాష్ అభివర్ణించారు.
ప్రజల అజ్ఞానాన్ని అడ్డుపెట్టుకుని బతుకుతున్నారని,పెద్ద పెద్ద చదువులు చదివిన వారే ఈ దొంగ స్వాములు భజన చేస్తున్నారని బోరా సుభాశన్న తెలిపారు.చిన్న జీయర్ వేలాది ఎకరాల్లో వ్యాపారం చేస్తుంటే వారికి పాదసేవ చేసే స్వార్ధపరులు ఉండబట్టే చిన్న జీయర్ ఆగడాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.
చిన్న జీయర్ అందరిలాగే మామూలు మనిషి అని,భక్తి వ్యాపారం చేస్తుంటే భజన మానుకోవాలని భక్తులను బోరాజి కోరారు.కర్ర చేతబట్టి,కాషాయం ధరించి, అమాయకుల మూడభక్తి పెట్టుబడిగా,దేవుడి పేరు చెప్పి పాపపుణ్యాలు పక్కనబెట్టి వేలకోట్లు అక్రమంగా దోచుకుని నేడు దేశాన్నేశాసించే స్థాయికి చిన్నజీయర్ ఎదిగాడంటే మన చట్టాలు ఎవరికీ చుట్టాలుగా మారాయో ఆలోచించాలని బోరా సుభాశన్న విజ్ఞప్తి చేశారు.
పదవతరగతి కూడా చదవని వాడు దేవుళ్ళను అడ్డుపెట్టుకొని భక్తిని వ్యాపారంగా మార్చి అడ్డదారుల్లో అన్యాయంగా వేలకోట్ల నల్లధనం వరదలా ప్రవహిస్తుంటే,చిన్నజీయర్ కి మదమెక్కి కళ్లు నెత్తికెక్కి అగ్రకుల అహంకారాన్ని ప్రదర్శిస్తున్నాడని బోరా సుభాశన్న ఆరోపించారు.సమతమూర్తి విగ్రహం చూడటానికి 150 రూపాయలు టికెట్ పెట్టి,పూజలో కూర్చోవాలంటే 25 వేల నుండి 25 లక్షల వరకు టికెట్ కేటగిరి కేటాయించి,ఎవరైనా ఇంటికి ఆహ్వానిస్తే లక్షలు ముడుపులు స్వీకరించి దర్శనమిచ్చే దగాకోరు చిన్నోడు సమ్మక్క సారక్కలను అవమానిస్తే నేటి వరకు టిఆర్ఎస్,బిజేపి ఎందుకు స్పందించడం లేదని బోరా ప్రశ్నించారు.
ప్రజల మనోభావాలను పట్టించుకోని పార్టీలను,మోడీ,కేసీఆర్ రహస్య నాటకాలను గమనించాలని బోరాసుభాశన్న సూచించారు.దళితులు మహిళలు మురికి పనులు చేయాలని,మరుగుదొడ్లు కడగాలని అగ్రకులాల వారు అధికారం చేపట్టాలని, ఆర్థిక లెక్కలు చూడాలని చెబుతున్న చిన్నజీయర్ అసలు దేవున్ని సృష్టించింది మనుషులు కాదా అని బోరా సుభాశన్న ప్రశ్నించారు.సమ్మక్క సారక్కలు మీ అగ్రకుల దేవుళ్ళలా రాతి బొమ్మల్లో చెక్కిన దేవుళ్ళు కాదని,నీలాగా,నాలాగా ప్రజలందరి లాగానే రక్తమాంసాలతో ఈ నేల మీద నడయాడిన సామాన్య మానవులని బోరన్న పేర్కొన్నారు.13 వ శతాబ్దంలో వారు జీవించిన కాలంలో కాకతీయ సామ్రాజ్య అగ్రకుల రాజులు పన్నుల పేరుతో ప్రజలను పీడిస్తుంటే,ప్రజల హక్కుల కోసం నేడు అడవిలో ఉంటూ ప్రజల కోసం ప్రాణాలను త్యాగం చేస్తున్న నక్సలైట్ల మాదిరిగానే సమ్మక్క సారక్క,జంపన్నలు ప్రజల కోసం ప్రజా పోరాటం చేసి అమరత్వం పొందారని బోరన్న పేర్కొన్నారు.న్యాయమైన హక్కులకోసం,ఆత్మ గౌరవం కోసం,శ్రమజీవుల స్వయం పాలన కోసం వీరోచితంగా పోరాడిన త్యాగ ధనులను దేవుళ్లుగా స్మరిస్తూ కోట్లాది మంది ప్రజలు రెండు సంవత్సరాలకు ఒకసారి స్మారకోత్సవాలు జరపడం దొరలకు నాటి నుండి నేటి వరకు మింగుడు పడటం లేదని సుభాశన్న ఆరోపించారు.
నువ్వు కష్టపడాల్సిందేమీ లేదు.నాకు చేతులెత్తి మొక్కితే చాలు అన్నీ నేను చూసుకుంటాననే దొంగ దేవుళ్లకు భిన్నంగా మీ సమస్యల పరిష్కారం కొరకు,నువ్వే తెగించి పోరాడాలని,పోరాటమే జీవితం అంటూ ఉపదేశించిన నేటి నక్సలైట్స్ లాంటి మా శ్రామిక ప్రజలకు దేవుళ్ళైన సమ్మక్క సారక్కలను అవమానించిన చిల్లర గాడు చిన్న జీయర్ ను తక్షణమే అరెస్టు చేయాలని,తగిన బుద్ధి చెప్పాలని బోరా సుభాశన్న డిమాండ్ చేశారు.
ఎన్నో మతాలకు, విశ్వాసాలకు నిలయమైన మనదేశంలో ఒకరిని మరొకరు నిందించుకోకుండా చూడాల్సిన పాలకులు చిల్లర స్వాములను ప్రోత్సహిస్తున్నారని బోరా సుభాశన్న ఆరోపించారు.బిడ్డల పాలకై బిచ్చమెత్తు దేశంలో,రాళ్లకు,పుట్టలకు,పాములకు పాలు పోసే అజ్ఞానులు మేలుకొల్పాలని,పేదలకు బొట్టుపెట్టి దైవమని పూజించే బదులు,పేదల సంక్షేమానికి కృషి చేయాలని సమ్మక్క సారక్కలాగా ఆత్మగౌరవం కోసం, ప్రజల హక్కుల కోసం పోరాడాలని ప్రజా ఉద్యమకారుడు బోరా సుభాశన్న పిలుపునిచ్చారు.
కూడు తినని దేవునికి నైవేద్యం ఎందుకని,చెమట పట్టని దేవునికి స్నానం ఎందుకని,కాపురం చేయని దేవునికి కళ్యాణం ఎందుకని,ఎండ వాన చలి స్పర్శ తెలియని దేవునికి నివాసం ఎందుకని,పని చేయని దేవునికి పట్టువస్త్రాలు,నగలు,నగదు ఎందుకని, వినపడని దేవునికి విన్నపాలు ఎందుకని ప్రశ్నించిన తమిళ ద్రవిడ ఉద్యమనేత కరుణనిధి నుండి ప్రజలందరూ ఎంతో నేర్చుకోవాలని బోరా సుభాశన్న సూచించారు.కనపడని,వినపడని గుళ్లు,గోపురాలు తిరిగే బదులు,దొంగ బాబాలకు,స్వాములకు ముడుపులు చెల్లించే బదులు పేద విద్యార్థులు, వీధిబాలల,అనాధ పిల్లల సంక్షేమానికి సంపాదించిన దాంట్లో కొంత ఖర్చు పెడితే పుణ్యం వస్తాదో రాదో తెలియదు కానీ,మనసుకు మానసిక ప్రశాంతత వస్తదని,అభాగ్యుల జీవితాల్లో వెలుగు వస్తదని బోరా సుభాశన్న తెలిపారు.
ప్రజల హక్కుల కోసం పోరాడిన సమ్మక్కసారాలక్క స్ఫూర్తిని కొనసాగించాలని, అసమానతలు లేని నూతన ప్రజాస్వామిక వ్యవస్థ నిర్మాణం కోసం పోరాటాలు,ఉద్యమాలు చేపట్టాలని విద్యార్థి,యువజనులకు బోరా సుభాశన్న పిలుపునిచ్చారు.దొంగ బాబాలపై,దొంగ స్వాములపై త్వరలో మంచి పుస్తకాన్ని తీసుకువస్తామని రచయితలు 9848540078 నెంబర్కి వాట్సాప్ ద్వారా రచనలు పంపాలని బోరా సుభాశన్న పేర్కొన్నారు.
Latest Nalgonda News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy