కమలంతో లాభం లేదు సైకిలే బెటర్ ?

తెలుగుదేశం పార్టీతో అనుబంధం కొనసాగినంత కాలం దక్కిన గౌరవ మర్యాదలు, ఆదరణ తలుచుకుని ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఆవేదన చెందుతున్నట్లు తెలుస్తుంది.ప్రస్తుతం బీజేపీతో అధికారికంగా పొత్తు పెట్టుకున్న తరువాత దగ్గర నుంచి జనసేన కు తగిన గుర్తింపు లేకుండా పోయింది.

 Pawan, Janasena,bjp,chandrababu,tdp, Ysrcp, Allignment, Narendra Modi-TeluguStop.com

అసలు పొత్తు పెట్టుకున్నామన్న సంతోషం కూడా ఎక్కడా కనిపించడం లేదు.దీనికి కారణం బిజెపి పెద్దలు ఎవరు పవన్ పెద్దగా గుర్తించక పోవడమే.

ఏ విషయంలోనూ మిత్రపక్షంగా ఉన్న తమతో ఎటువంటి సంప్రదింపులు చేయకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలబడుతుండడం పవన్ కు రుచించడం లేదు.పోనీ ఏపీ బీజేపీ నేతలైన జనసేన కలుపుకుని వెళ్తున్నారా అంటే అదీ లేదు.

ఏపీ బీజేపీ లో మూడు గ్రూపులు ఉండడంతో ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.

అసలు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వెనుక పవన్ చాలా లెక్కలే వేసుకున్నారు.2024లో అధికారంలోకి వచ్చేందుకు బిజెపి సహకారం అవసరమని, ఒంటరిగా ఎన్నికల బరిలోకి వెళ్ళి ఆర్థికంగా, రాజకీయంగా తమ శక్తి సరిపోదని పవన్ అంచనాకు వచ్చే బిజెపితో జత కట్టారు.మొదట్లో పవన్ కు ఆ స్థాయిలో ప్రాధాన్యం బిజెపిలో దక్కింది.

కానీ ఇప్పుడు ఆ ప్రాధాన్యం తమకు దక్కడం లేదనే బాధ ఎక్కువగా కనిపిస్తోంది.కరోనా వైరస్ తరువాత దేశమంతా లాక్ డౌన్ విధించిన ప్రధాని మోదీ ఆ సందర్భంగా దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు.

అలాగే వివిధ పార్టీల అధినేతలకు ఫోన్ లు చేస్తున్నారు.

Telugu Chandrababu, Janasena, Narendra Modi, Pawan, Ysrcp-Telugu Political News

ఆ విధంగానే టీడీపీ అధినేత చంద్రబాబుకు సైతం మోదీ ఫోన్ చేశారు.కానీ మిత్రపక్షంగా ఉన్న తనకు ప్రధాని ఫోన్ చేయలేదని పవన్ గుర్రుగా ఉన్నారట.అదీకాకుండా తమకంటే ఎక్కువగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రాధాన్యం ఇవ్వడం పవన్ కు మింగుడు పడడం లేదు.

దీంతో అనవసరంగా బిజెపితో పొత్తు పెట్టుకున్నానని, ఆ పొత్తు ఏదో టీడీపీ తో పెట్టుకుని ఉంటే రాజకీయంగా మంచి మైలేజ్ వచ్చేదని పవన్ అంచనా వేస్తున్నారు.తాను టిడిపికి గతంలో మద్దతు ఇచ్చిన సమయంలో ఆ పార్టీ లో దక్కిన గౌరవం, మర్యాద ఇప్పుడు బీజేపీలో దక్కడం లేదని, అసలు తనను పట్టించుకునే వారే కరువయ్యారని పవన్ అభిప్రాయానికి వచ్చేశారు.

ఈ నేపథ్యంలో బీజేపీ కంటే టిడిపితోనే జతకడితే రాజకీయంగా మంచిదనే అభిప్రాయాన్ని పవన్ తన సన్నిహితుల దగ్గర వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube