ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీజేపీ శ్రేణులు...!

నల్లగొండ జిల్లా:పోటీ పరీక్ష నిర్వహణలో వైఫల్యం చెందిన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో బీజేపీ నల్లగొండ పట్టణ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.

ఈ సందర్భంగా బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ టిఎస్పిఎస్సి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్ని పోటీ పరీక్షల పేపర్ లీకులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతూ ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పరీక్షలు పకడ్బందీగా నిర్వహించలేని ఈ చేతకాని అసమర్ధ ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.లీకులకు కేరాఫ్ అడ్రస్ గా మారిన టిఎస్పిఎస్సి బోర్డును రద్దు చేసి,చైర్మన్ మరియు పాలక మండలిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు.

BJP Leaders Burnt The Effigy Of The Government , BJP Leaders, Nalgonda , Brs , T

ఈ కార్యక్రమంలోరాష్ట్ర,జిల్లా,పట్టణ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మూసికి పూడిక ముప్పు
Advertisement

Latest Press Releases News