బూడిద తెగులు( Powdery Mildew ) గాలి, నీరు, క్రిముల ద్వారా కాకర పంటను ఆశిస్తాయి.తెగులు అనేది ఒక శిలీంద్రం.
పొడి వాతావరణం, తేమ వాతావరణం, కొద్దిపాటి వర్షం ఉన్న ఈ తెగులు పంటను ఆశించడానికి అవకాశం ఉంది.ఈ బూడిద తెగులు ఆశించిన మొక్కలలో ఎలాంటి లక్షణాలు ఉంటాయో.
వాటిని ఎలా గుర్తించి నివారించాలో పూర్తిగా అవగాహన ఉంటేనే కాకర పంటలు( Bitter Gourd ) అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది.
కాకర మొక్క ఆకులపై, కాండంపై, కాకరకాయలపై తెల్లని మచ్చలు ఏర్పడి, కింది భాగంలో తెల్లటి పూతలాగా కనిపిస్తే వాటిని బూడిద తెగులుగా నిర్ధారించుకోవాలి.
వాత ఈ తెగులు కిరణజన్య సంయోగ క్రియను( Photosynthesis ) అడ్డుకొని ఆకుపచ్చ రంగులో ఉండే ఆకులను పసుపు రంగులోకి మార్చి ఎండిపోయేలాగా చేస్తాయి.ఈ ప్రక్రియలో కొన్ని ఆకులను వంకర్లు తిరగడం, కొన్ని ఆకులు విచ్చిన్నం చెంది రూపం కోల్పోవడం జరుగుతుంది.
ఆ తర్వాత ఈ తెగులు పూత, పిందె లపై తీవ్ర ప్రభావం చూపుతాయి.కాబట్టి ఈ తెగులను సకాలంలో గుర్తించి నివారించాలి.
బూడిద తెగులు పంటను ఆశించకుండా ఉండాలంటే తెగులను తట్టుకునే మేలు రకం విత్తనాలను ఎంపిక చేసుకోవాలి.మొక్కలకు సూర్యరశ్మి, గాలి తగిలేలా కాస్త దూరంగా నాటుకోవాలి.ఆకులపై తెల్లని మచ్చలు కనిపించిన వెంటనే ఆకులను తొలగించాలి.అవసరం అయితే మొక్కని పంట నుండి వేరు చేసేయాలి.
ముందుగా ఈ తెగుల నివారణ కోసం సేంద్రీయ పద్ధతిలో వేప నూనె, గంధకం లను నీటిలో కలిపి మొక్క ఆకులు పూర్తిగా తడిచేలాగా పిచికారి చేయాలి.అత్యవసర పరిస్థితులలో రసాయన పద్ధతులను పాటించాలి.హెక్సాకోనజోల్ట్ ట్రైప్లుమిజోల్ లేదా మైక్లోబ్యూటనిల్ రెండు మిల్లీ లీటర్లను ఒక లీటరు నీటిలో కలిపి పంటకు పిచికారి చేయాలి.