నిర్మల్ జిల్లాలో రైతులు నిరసనకు దిగారు.తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ చిట్యాలలో జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు.
ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు వెంటనే లారీలలో గోదాంలకు తరలించాలని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.రైతుల నిరసనతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
దీనిపై సమాచారం అందుకున్న ఎమ్మార్వో, స్థానిక ఎస్ఐ సంఘటన స్థలానికి చేరుకుని రైతులకు సర్ది చెప్పారు.దీంతో రైతులు ఆందోళనను విరమించారు.