ఒకప్పుడు తెలుగులో అగ్ర హీరోయిన్‌గా రాణించిన సహజ నటి సౌందర్య గురించి ఇప్పటికీ ఫ్యాన్స్ మర్చిపోలేక పోతున్నారు.ఎందుకంటే ఆమె ప్రేక్షకుల మనుషుల్లో వేసిన ముద్ర అలాంటిది.
సావిత్రి తర్వాత తెలుగు ఇండస్ట్రీలో సౌందర్యకే లాయల్ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కింది.ఎక్స్‌పోజింగ్ చేయకుండా కేవలం తన హావభావాలతో, నేచురల్ యాక్టింగ్‌తో నటించి మెప్పించిన ఈ తార నెగిటివ్ రోల్స్ కూడా చేసింది.
కమెడియన్లతో కూడా డ్యాన్స్ చేసి తన గ్రౌండ్-టు-ఎర్త్ నేచర్‌ని చాటుకుంది.
అంత మంచి మనసు గల సౌందర్యని అందరూ ఇష్టపడేవారు.సెట్స్ లో ఆమెతో చాలా క్లోజ్‌గా మూవ్ అయ్యేవారు.నిజానికి పైకి సౌందర్య చాలా కామ్ గా, కూల్ గా అమాయకత్వం మూర్తిభవించిన అమ్మాయిల కనిపిస్తుంది కానీ ఆమె అంత సాఫ్ట్ కాదట.
మంచిగా ప్రశాంతంగా ఉన్నంతవరకు తనంత కూల్ పర్సన్ ఎవరూ ఉండరు కానీ ఒక్కసారి కోపం వస్తే మాత్రం ఎవరైనా సరే వణికి పోవాల్సిందేనట.ముఖ్యంగా సినిమా షూటింగ్స్‌లో ఎవరైనా తనకు నచ్చని పనులు చేస్తే సౌందర్య కి ఒక్కసారిగా పట్టరాని కోపం వస్తుందట.
ఆమెతో కలిసి నటించిన వారు.అలాగే సినిమా సంబంధిత వ్యక్తులు ఈ విషయాన్ని వెల్లడించారు.
అంతేకాదు కోపం వస్తే సౌందర్యని అలా వదిలేయడమే బెటర్ లేదంటే ఆమె ఆగ్రహానికి బలైపోవాల్సిందేనట.ఆమెకు ఆ తీవ్ర కోపమే పెద్ద మైనస్ అయిందని.ఆ కారణంగానే తల్లిదండ్రులు చెప్పిన వారిపై అరిచేసి ఇంటి నుంచి బయటకు వచ్చేసిందని.చివరికి తల్లిదండ్రులకు ఇష్టం లేని పెళ్లి చేసుకొని అనవసరమైన తలనొప్పులు వచ్చిందని పలువురు మాట్లాడుతుంటారు.
ఏది ఏమైనా సౌందర్య లాంటి గొప్ప నటిని కోల్పోవడం ప్రేక్షకులందరికీ తీరని లోటు అని చెప్పవచ్చు.