సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలి: ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి

సూర్యాపేట జిల్లా: వర్షా కాలంలో సంభవించే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అధికారులను ఆదేశించారు.

గురువారం సూర్యాపేట జిల్లా మోతె మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆమె ముఖ్యాతిథిగా హాజరై పలు శాఖలపై సమీక్ష నిర్వహించారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ మండల అధికారులు అందరూ సమన్వయంతో పని చేయాలని,గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, గ్రామాలకు కావలసిన మౌలిక వసతులు, కనీస సౌకర్యాలు ఎప్పటికప్పుడు తమ దృష్టికి తెస్తే పరిష్కరించే విధంగా నేను బాధ్యత తీసుకుంటానన్నారు.వివిధ శాఖల అధికారులతో రివ్యూ చేసి వారికి తగు చూచనలు చేశారు.

ఈ కార్యక్రమంల్ ఎంపీపీ ఆశ, జిల్లా పరిషత్ చైర్మన్ గుజ్జ దీపిక,ఆర్డీఓ వేణుమాధవ్, జడ్పిటిసి పుల్లారావు, ఎంపీడీవో హరిసింగ్, ఎంపీటీసీలు,వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Suryapet News