నీట్ పేపర్ లీకేజీలో బీజేపీ నాయకుల హస్తం: సిపిఎం నేత ఎస్.వీరయ్య

సూర్యాపేట జిల్లా: నీట్ పరీక్ష కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్.వీరయ్య డిమాండ్ చేశారు.

 Bjp Leaders Hand In Neet Paper Leakage Cpm Leader S Veeraiah, Bjp Leaders , Neet-TeluguStop.com

గురువారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల కేంద్రంలోని శ్రీ సత్య ఫంక్షన్ హాల్ లో జరుగుతున్న సిపిఎం సూర్యాపేట జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.నీట్ పరీక్ష పేపర్ లీకేజీ మూలంగా 24 లక్షల కుటుంబాలు తీవ్ర ఆవేదనలో ఉన్నారన్నారు.

వారి పిల్లల భవిష్యత్తు ఏమిటని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని కోచింగులు తీసుకొని పరీక్షలు రాస్తే చివరి నిమిషంలో పేపర్ లీకేజీ,కుంభకోణాలు జరిగి విద్యార్థుల భవిష్యత్తు అంతా అంధకారం అయిందని ఆందోళన వ్యక్తం చేశారు.

నీట్ పరీక్ష పత్రాలుబీహార్,గుజరాత్, హర్యానా రాష్ట్రాలలో లీక్ అయినాయని ఆరోపణలు వస్తున్నాయన్నారు.

ముఖ్యంగా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో పేపర్ లీకేజీ జరిగిందన్నారు.

పేపర్ లీకేజీలో బీజేపీ నాయకుల పాత్ర ఉందని ఆరోపణలు రోజురోజుకు పెరుగుతున్నాయన్నారు.బీహార్ పోలీసులు పరీక్ష పత్రాల లీకేజీకి సంబంధించి 16 మందిని అరెస్టు చేశారన్నారు.

పేపర్ లీకేజీలో అవకతవకలు జరగనప్పుడు బీహార్ లో ఎందుకు 16 మందిని అరెస్టు చేశారో బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ పేపర్ లీకేజీ వెనక కోట్లాది రూపాయలు తారుమారయ్యాయని అన్నారు.

గ్రేస్ మార్కులు ఉంటాయని ప్రభుత్వం ముందు చెప్పలేదని, మార్కులలో తేడాలు ఎందుకు ఉన్నాయని అడిగితే గ్రేస్ మార్కులు కలిపామని చెబుతున్నారని,ఎంట్రన్స్ టెస్టులలో ఎప్పుడు గ్రేస్ మార్కులు వినలేదన్నారు.పేపర్ లీకేజీ అవకతవకలపై కేంద్ర విద్యా శాఖ మంత్రి కానీ, దేశ ప్రధాని నరేందర్ మోడీ కానీ,నేటికీ నోరు మెదపలేదని విమర్శించారు.

ఏడవ విడత ఎన్నికల సందర్భంగా నేను దేవదూతనని దేశాన్ని రక్షించేందుకు దేవుడు నన్ను పంపించాడని చెప్పిన మోడీకి పేపర్ లీకేజీ తెలవకపోవడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు.ప్రధాని దేవుడైతే ఆయన పాలనలో పరీక్ష పత్రాలు లీక్ ఎందుకయ్యాయని ప్రశ్నించారు.

ఇటీవల జరిగిన నెట్ పరీక్షలలో సైతం అవకతవకలు జరిగాయని వాటిని వెంటనే కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని అన్నారు.ఏ రాష్ట్రం ఆ రాష్ట్రంలో పరీక్షలు నిర్వహిస్తుందని, కానీ,మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాల హక్కులను కాలరాసే విధంగా వ్యవహరిస్తూ కేంద్రమే పరీక్షలు నిర్వహించడం సరైంది కాదని ఆరోపించారు.

300 సీట్లు సాధిస్తామని గొప్పగా చెప్పిన నరేంద్ర మోడీ ప్రభుత్వం చావు తప్పి కన్ను లొట్టపోయినట్టుగా 240 సీట్లకే పరిమితం అయిందన్నారు.దేవుడు పేరుతో రాజకీయాలు చేసిన అయోధ్యతో పాటు అనేక ప్రాంతాలలో బీజేపీ ఓడిపోయిందన్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీలన్నింటిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.రుణమాఫీపై స్పష్టమైన ప్రకటన చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు.అంతకుముందు పార్టీ కార్యక్రమం(ప్రోగ్రాం)అనే క్లాసును సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పి.సోమయ్య బోధించారు.అనంతరం సిపిఎం జిల్లా కర్తవ్యాల రిపోర్ట్ ను సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి ప్రవేశపెట్టారు.సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు ప్రిన్సిపల్ గా వ్యవహరించిన ఈ శిక్షణ తరగతుల్లో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, పారేపల్లి శేఖర్ రావు, మట్టిపల్లి సైదులు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు,కోట గోపి,చెరుకు ఏకలక్ష్మి, సిపిఎం మండల కార్యదర్శి రణపంగ కృష్ణ,సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ధనియాకుల శ్రీకాంత్ వర్మ, వీరబోయిన రవి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube