మోడల్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

నల్గొండ జిల్లా:మర్రిగూడ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ప్రవేశాలకు 6వ,తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శివ స్వరూపరాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.6వ,తరగతిలో 100 సీట్లు, 7వ,తరగతి నుంచి 10వ, తరగతి వరకు మిగిలిన సీట్లకు ప్రవేశాలు కల్పిస్తామన్నారు.

ఈనెల 6 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.బీసీ,ఎస్సీ, ఎస్టీ,పిహెచ్సీ,ఈడబ్ల్యూఎస్(BC, SC, ST, PHC, EWS) విద్యార్థులు రూ.125, ఓసి విద్యార్థులు రూ.200 చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు.6వ, తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 13 ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు,7వ,తరగతి నుంచి 10వ,తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు ప్రవేశ పరీక్ష స్థానిక మోడల్ స్కూల్లోనే నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

Latest Nalgonda News