ఏం.. అవి లేకుండా కొంతకాలం ఉండలేరా.. అంటూ ఫైర్ అయిన రష్మీ... 

టాలీవుడ్ బ్యూటిఫుల్ యాంకర్ మరియు హీరోయిన్ రష్మి గౌతమ్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటూ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు పలు సూచనలు, సలహాలు ఇస్తూ తన అభిమానులకు అందుబాటులో ఉంటోంది.అంతేగాక సమాజానికి సంబంధించిన సమస్యల పై కూడా స్పందిస్తోంది.

 Rashmi Gautam, Tollywood Anchor, Lock Down, Corona Virus, Jabardesth, Dhee, Telu-TeluguStop.com

అయితే తాజాగా లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి రోడ్లపై సంచరిస్తున్న వారిపై రష్మి గౌతమ్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఫైర్ అయ్యింది.

ఇందులో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్రంలోని పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, వైద్యులు తదితర సంబంధిత శాఖలు ఎంతగానో కష్టపడుతున్నప్పటికీ కొందరు మాత్రం పిజ్జాలు, బర్గర్లు అంటూ అనవసరంగా రోడ్లపైకి వస్తున్నారని ఇది సరికాదని అంటూ ఈ అమ్మడు ఆగ్రహం వ్యక్తం చేసింది.

అంతేగాక అత్యవసరం అయితే తప్ప రోడ్లపైకి రావద్దంటూ ప్రజలని కోరుతోంది.ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను దృష్ట్యా ఇంట్లో ఉన్నవాటితో సర్దుకుపోవాలని అలా కాకుండా ప్రతి చిన్న అవసరానికి బయటికి వస్తే పలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా తెలిపింది.

అలాగే ప్రభుత్వ అధికారులు మరియు వైద్యులు తెలిపినటువంటి జాగ్రత్తలను మరియు ఆదేశాలను చక్కగా పాటిస్తే కరోనా వైరస్ ని తొందరలోనే దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని అది మన చేతుల్లోనే ఉందని కూడా తెలిపింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో కొత్త సినిమాలు లేక ఖాళీగా గడుపుతోంది.

కానీ బుల్లి తెరపై మాత్రం ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ మరియు సౌత్ ఇండియా నంబర్ వన్ డాన్స్ షో “డీ”జోడి లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది.అయితే తన అందం, నటన, అభినయంతో చక్కగా ప్రేక్షకులను ఆకట్టుకునేటువంటి రష్మి గౌతమ్ సినిమాల్లో ఎందుకు అవకాశాలు దక్కించుకోలేక పోతోందో ఇప్పటికీ అర్థం కావడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube